ఖాతాల భద్రత..
ట్విట్టర్‌లో తమ ఖాతాలను భద్రపరచడానికి చెల్లింపు చందాదారులు మాత్రమే టెక్స్ట్ మెసేజ్‌లను టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) సౌకర్యాన్ని పొందటానికి అనుమతిస్తామని ట్విట్టర్ ఇటీవల వెల్లడించింది. మార్చి 20 తర్వాత “ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే టెక్స్ట్ మెసేజ్‌లను వారి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెథడ్‌గా ఉపయోగించగలరు” అని కంపెనీ ట్వీట్ చేసింది.

సెక్యూరిటీ ఇలా..
టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ విధానం వల్ల ట్విట్టర్ ఖాతాల భద్రత మరింతగా మెరుగుపడుతుందని ట్విట్టర్ భావిస్తోంది. ఇందులో పాస్‌వర్డ్ తో పాటు ట్విట్టర్ ఖాతాదారులు ఎంపిక చేసుకున్న మరో అథెంటికేషన్ అందించాల్సి ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్ ల విషయంలో 2FAను అనుమతిస్తుంది. ఫోన్ నంబర్ ఆధారిత 2FA దుర్వినియోగం అవుతున్నట్లు కంపెనీ భావిస్తోంది.

నకిలీ ఖాతాలు..
ప్రధానంగా నకిలీ ఖాతాలతో ట్విట్టర్ ఇబ్బందిని ఎదుర్కుంటోంది. టెలికాం కంపెనీలు బాట్ ఖాతాలను 2FA SMSలను పంప్ చేసేందుకు వినియోగిస్తున్నారని ఒక ఖాతాదారునికి సమాధానం ఇస్తూ ఎలాన్ మస్క్ అన్నారు. వీటి వల్ల కంపెనీకి ఏడాదికి 60 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని మస్క్ వెల్లడించారు.

బ్లూటిక్ వెరిఫికేషన్..
ట్విట్టర్ గతంలో రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టులతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల ధృవీకరించబడిన ఖాతాలకు ఉచితంగా బ్లూ చెక్ మార్క్ అందించింది. అయితే మస్క్ వచ్చిన తర్వాత ఈ సేవలకు రుసుము చెల్లించాల్సి రావటంతో అందుకు సిద్ధంగా ఉన్న ఎవరికైనా వెరిఫైడ్ అకౌంట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ కోసం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధరను iOS సబ్‌స్క్రైబర్‌ల మాదిరిగానే నెలకు $11గా నిర్ణయించినట్లు ట్విట్టర్ గత నెలలో తెలిపింది.