Upcoming IPO’s: వచ్చే వారం మార్కెట్లోకి రెండు ఐపీవోలు.. మీరూ కొనాలనుకుంటున్నారా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Upcoming IPO’s: ఈ ఏడాది ఇన్వెస్టర్లకు కేవలం రెండు పెట్టుబడి అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి ఐపీవోలు వచ్చే వారం మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే 2022లో ఇప్పటి వరకు మెుత్తం 36 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.62,000 కోట్లను సమీకరించాయి. పైగా ఐపీవోలలో ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఏడాది చాలా బాగుందనే చెప్పుకోవాలి. మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా ఐపీవోలు మంచి విజయాన్ని సాధించటంతో పాటు తమ ఇన్వెస్టర్లకు భారీగా రాబడిని ఆర్జించి పెట్టాయి.

KFin టెక్నాలజీస్ IPO..
KFin టెక్నాలజీస్ IPO 19 డిసెంబర్ 2022న స్టాక్ మార్కెట్‌లో ప్రారంభమవుతోంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ.1500 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 347-366 మధ్య నిర్ణయించింది. అయితే ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లను జారీ చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు మాత్రమే తమ వాటాలను కంపెనీలో నిలుపుకుంటారు. ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్ల కోసం డిసెంబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. కెఫిన్ టెక్నాలజీస్ ఆర్థిక సేవలను అందిస్తుందని మనందరికీ తెలిసిందే.

Upcoming IPO's: వచ్చే వారం మార్కెట్లోకి రెండు ఐపీవోలు.. మీరూ

ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో..
ఎలిన్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ. ఎలిన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనేక ప్రధాన బ్రాండ్ల కోసం లైట్లు, ఫ్యాన్లు, వంటగది ఉపకరణాలను తయారు చేసే కంపెనీ. IPO యాంకర్ పెట్టుబడిదారుల కోసం 19 డిసెంబర్ 2022న తెరవబడుతోంది. సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో డిసెంబర్ 20న మార్కెట్లో ప్రారంభమవుతోంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం రూ.475 కోట్లను సమీకరించేందుకు కంపెనీ సన్నాహాలు చోస్తోంది. దీనికోసం ఒక్కో షేరు ధరను కంపెనీ రూ.234-247గా నిర్ణయించింది.

English summary

kfin technologies, elin electronics IPO’s coming into market next week

kfin technologies, elin electronics IPO’s coming into market next week

Story first published: Sunday, December 18, 2022, 15:25 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *