PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Upcoming IPO’s: వచ్చే వారం మార్కెట్లోకి 3 ఐపీవోలు.. ఇన్వెస్టర్లకు ధనవంతులయ్యే ఛాన్స్..

[ad_1]

వచ్చే వారం ఐపీవోలు..

వచ్చే వారం ఐపీవోలు..

అంతర్జాతీయ పరిణామాల మధ్య ఓలటైల్ గా మారిన మార్కెట్లకు కొత్తగా వస్తున్న విజయవంతమైన ఐపీవోలు బూస్టర్ డోస్ గా పనిచేస్తున్నాయి. ఇవి మార్కెట్లలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కొంత మేర పెంచుతున్నాయి. ఈ క్రమంలో వచ్చేవారం దాదాపుగా రూ.1,830 కోట్లు విలువైన మూడు ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత వరకు మక్కువ చూపుతారు.. ఏది విజయవంతంగా లిస్ట్ అవుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. కానీ.. మంచి ఆధరణ పొందితే మెుదటి రోజే ఇన్వెస్టర్లకు కనవర్షం కురవటం కాయంగా కనిపిస్తోంది. ఇటీవల చాలా ఐపీవోలు ఇలాగే విజయవంతం అవ్వటం కొంత ఊరటను ఇస్తున్న అంశంగా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

సులా వైన్‌యార్డ్స్ IPO:

సులా వైన్‌యార్డ్స్ IPO:

దేశంలోని అతిపెద్ద వైన్ ఉత్పత్తిదారుగా ఉన్న సులా వైన్‌యార్డ్స్ తాజాగా ఐపీవో రూపంలో ఈక్విటీ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 12న మార్కెట్లోకి రాబోతోంది. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి డిసెంబర్ 14 వరకు అవకాశం ఉంది. ఈ కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాంక్ ఒక్కోదానికి రూ.340-రూ.357గా కంపెనీ నిర్ణయించింది. ఇష్యూ ద్వారా రూ.960 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. అయితే ఈ ఐపీవో పరిమాణం రూ.1,200-రూ.1,400 కోట్లని చెప్పుకోవాలి. శుక్రవారం సులా వైన్ యార్డ్స్ గ్రే మార్కెట్ ప్రీమియం దాదాపుగా రూ.40 వద్ద ఉంది. ఇది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

అబాన్స్ హోల్డింగ్స్ IPO:

అబాన్స్ హోల్డింగ్స్ IPO:

ఆర్థిక సేవల వ్యాపారంలో ఉన్న అబాన్స్ హోల్డింగ్స్ కూడా తన IPOను డిసెంబర్ మాసంలోనే ఇన్వెస్టర్ల ముందుకు తీసుకొస్తోంది. ఈ ఐపీవో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 15 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. కంపెనీ ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ.265-రూ.270గా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తంగా రూ.345.60 కోట్లను సమీకరించనుందని సమాచారం. అయితే ఈ ఇష్యూలో రూ.102 కోట్లు విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేస్తుండగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ అని తెలుస్తోంది. అయితే శుక్రవారం అంబాస్ హోల్డింగ్ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం రూ.20 వద్ద ఉంది. దీనిపై కూడా చాలా మంది ఇన్వెస్టర్లు మంచి ఆసక్తిన కనబరుస్తున్నారు.

ల్యాండ్‌మార్క్ కార్స్ IPO:

ల్యాండ్‌మార్క్ కార్స్ IPO:

వాహన ‘డీలర్‌షిప్’ వ్యాపారంతో అనుబంధించబడిన ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్ ఐపీవో సైతం వచ్చే వారమే ఉంది. ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం ఐపీవో డిసెంబర్ 13న తెరవబడుతోంది. కంపెనీ దీనికోసం ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ.481-రూ.506గా నిర్ణయించింది. డిసెంబర్ 15న ముగిసే ఈ ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 12న తెరచి ఉండనుంది. ప్రస్తుత ఐపీవో ద్వారా కంపెనీ రూ.150 కోట్లు కొత్త షేర్లను జారీ చేస్తుండగా.. రూ.402 కోట్లు విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉంటుందని తెలుస్తోంది. శుక్రవారం ఈ ఐపీవో గ్రేమార్కెట్ ప్రీమియం రూ.50 వద్ద ఉంది. ప్రస్తుతం ఒకేవారం మూడు ఐపీవోలు మార్కెట్లోకి రావటం వల్ల ఇన్వెస్టర్లకు మంచి అవకాశం లభించనుంది.

Note: ఐపీవోలలో పెట్టుబడులు పెట్టే ముందర వాటి వ్యాపార ఫండమెంటల్స్, గత పనితీరు, లాభదాయకత, కంపెనీ భవిష్యత్తు, రంగంలోని ఇతర పోటీ కంపెనీలు, గ్రోత్ వంటి అనేక ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *