News
oi-Mamidi Ayyappa
US
Banking
Crisis:
అమెరికాలో
సామాన్యులు
వణికిపోతున్నారు.
ఎప్పుడు
ఎలాంటి
వార్త
బాంబులా
నెత్తిన
పడుతుందోనని
ఆందోళన
చెందుతున్నారు.
ఒక
పక్క
యూఎస్
ఫెడ్
వడ్డీరేట్లను
పెంచుకుంటూ
పోతోంటే
మరో
పక్క
బ్యాంకులు
వరుసగా
కుప్పకూలుతున్నాయి.
దీంతో
చాలా
మంది
గందరగోళ
పరిస్థితులను
ఎదుర్కొంటున్నారు.
తాజాగా
ఫెడ్
ఛైర్మన్
పావెల్
వడ్డీ
రేట్లను
25
బేసిస్
పాయింట్ల
మేర
పెంచుతూ
తమ
పోరాటం
ద్రవ్యోల్బణం
అదుపులోకి
వచ్చేంతవరకు
ఆగదని
తేల్చి
చెప్పారు.
దీనిపై
చాలా
మంది
సామాన్యులు
స్పందిస్తూ
తరువాత
దివాలా
తీయనున్న
అమెరికా
బ్యాంక్
ఏమిటోనని
ప్రశ్నిస్తున్నారు.
ఈ
క్రమంలో
అమెరికాకు
చెందిన
పసిఫిక్
వెస్ర్టన్
బ్యాంక్
పేరు
తెరమీదకు
వచ్చింది.
దీనికి
ముందు
మూడు
యూఎస్
బ్యాంకులు
దివాలా
తీసిన
విషయం
తెలిసిందే.

రాయిటర్స్
వార్తా
సంస్థలో
వెల్లడైన
వివరాల
ప్రకారం
గతంలో
కుప్పకూలిన
బ్యాంకులు
మాదిరిగా
తాము
సైతం
రెగ్యులేటరీ
పరిస్థితులను
ఎదుర్కోవాల్సి
ఉంటుందేమోనని
పసిఫిక్
వెస్ర్టన్
ఆందోళన
చెందుతోంది.
ఇలాంటి
పరిస్థితులు
రాకుండా
చూసుకోవాలని
ప్రయత్నిస్తోంది.
అయితే
నిధుల
సమీకరించాలా
లేక
అమ్మేయాలా
అని
అన్వేషించటం
ఆందోళనలకు
కారణమౌతోంది.
ఈ
క్రమంలో
బ్యాంకు
కుప్పకూలే
అవకాశం
ఉందని
అనేక
మంది
భావిస్తున్నారు.
దీంతో
బ్యాంక్
స్టాక్
దాదాపు
50
శాతానికి
పైగా
క్రాష్
అయ్యింది.
కాలిఫోర్నియాతో
పాటు
డర్హామ్,
నార్త్
కరోలినా,
డెన్వర్,
కొలరాడోలో
ప్యాక్‌వెస్ట్
శాఖలను
కలిగి
ఉంది.
దీనికి
ముందు
మార్చి
చివరిలో
పెట్టుబడి
సంస్థ
అట్లాస్
SP
పార్ట్‌నర్స్
నుంచి
బ్యాంక్
దాదాపు
1.4
బిలియన్
డాలర్ల
నిధులను
సేకరించింది.

తాజా
పరిస్థితులతో
అమెరికాలోని
ప్రాంతీయ
బ్యాంకులు
ఒత్తిడిలో
ఉన్నాయి.
ప్యాక్‌వెస్ట్
షేర్లు
52
శాతం
క్షీణించగా..
వెస్ట్రన్
అలయన్స్
షేర్లు
23
శాతం
మేర
క్షీణించింది.
ఇదే
క్రమంలో
జియోన్
బాన్‌కార్ప్,
కొమెరికా
అండ్
ఫస్ట్
హారిజోన్
బ్యాంకులు
సైతం
నష్టపోయాయి.
మార్చి
8న
బ్యాంకింగ్
సంక్షోభం
ప్రారంభమైనప్పటి
నుంచి
ప్యాక్‌వెస్ట్
స్టాక్
దాదాపు
90
శాతం
విలువను
కోల్పోవటం
ఆందోళనలను
పెంచుతోంది.
దీనికి
ముందు
సిలికాన్
వ్యాలీ
బ్యాంక్,
సిగ్నేచర్
బ్యాంక్,
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
లు
కుప్పకూలాయి.
English summary
After silicon valley, first republic, signature banks US bank Pacific west to collapse, Know details
After silicon valley, first republic, signature banks US bank Pacific west to collapse, Know details
Story first published: Thursday, May 4, 2023, 10:54 [IST]