PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

vastu tips: ఇంటిద్వారాలు, గేట్లు ఉచ్ఛస్థానాలలోనే ఎందుకు పెడతారు? అసలీ ఉచ్ఛ- నీచ స్థానాలేంటి?

[ad_1]

ఇంటికైనా, ఖాళీ స్థలానికైనా ఉచ్ఛ నీచ స్థానాలు తెలుసుకోవటం అవసరం

ఇంటికైనా, ఖాళీ స్థలానికైనా ఉచ్ఛ నీచ స్థానాలు తెలుసుకోవటం అవసరం

ఖాళీ స్థలానికి అయినా, ఇంటికైనా ఉచ్ఛ, నీచ స్థానాలు ఉంటాయి. ఇంటి గేట్లు కానీ ద్వారాలు కానీ ఎప్పుడూ ఉచ్ఛ స్థానంలో ఉండాలి. అలా ఉంటేనే ఇంట్లోకి మనం నడిచే విధానం కూడా ఉచ్ఛ స్థానంలో ఉంటుంది. అసలు ఇంతకీ ఉచ్ఛ స్థానం, నీచ స్థానం ఏమిటి అంటే ఉచ్ఛ స్థానం అంటే ఇంట్లో నివసించే వారికి మేలు చేసే స్థానం. నీచ స్థానం అంటే ఇంట్లో నివసించే వారికి కీడు చేసే స్థానం. ఇలాంటి నీచ స్థానాలలో గేట్లు, ద్వారాలు ఉంటే ఆ దిశగా కుటుంబసభ్యులు నడక సాగిస్తే అది ఏమాత్రం వాస్తు రీత్యా మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా నీచ స్థానాలలో గేట్లు, ద్వారాలు ఏర్పాటు చేసుకున్న వారికి మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు.

ఇంటి గేటు ఉచ్ఛ స్థానంలోనే.. గుర్తించటం ఇలా

ఇంటి గేటు ఉచ్ఛ స్థానంలోనే.. గుర్తించటం ఇలా

ఇక ఉచ్చ స్థానాలు నీచ స్థానాలను గుర్తించటం విషయానికి వస్తే ఇందులో గేటు పెట్టే విషయంలో కాంపౌండ్ వాల్ ను మూడు భాగాలుగా చేయాలి. ఉదాహరణకు తూర్పువైపు ఉన్న కాంపౌండ్ వాల్ ను తీసుకుంటే దానిని మూడు భాగాలు చేస్తే ఉత్తరానికి దగ్గరగా తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉండే భాగం ఉచ్చ స్థానంగా పరిగణించబడుతుంది. ఇక దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయం ని తాగుతూ ఉండే స్థానం నీచ స్థానం గా చెప్పబడుతోంది. కాబట్టి సహజంగా చాలావరకూ తూర్పు ఈశాన్యం ని తాకుతూ ఉండే ఉచ్ఛస్థానంలోనే ఇళ్లకు గేట్లను ఏర్పాటు చేసుకుంటారు. పొరపాటున కూడా దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయం తాకుతూ ఉండే నీచ స్థానంలో గేట్లను ఏర్పాటు చేసుకోరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున అలా చేస్తే వారికి తీవ్ర నష్టం జరుగుతుంది.

ఉత్తరం గోడలో ఉచ్ఛ స్థానం ఇదే.. నీచస్థానం విషయంలో జాగ్రత్త

ఉత్తరం గోడలో ఉచ్ఛ స్థానం ఇదే.. నీచస్థానం విషయంలో జాగ్రత్త

ఇక ఉత్తరం గోడ విషయానికి వస్తే దీనిని కూడా మూడు భాగాలుగా విభజించి చూస్తే ఉత్తర ఈశాన్యం ని తాకుతూ తూర్పు దిశగా ఉండే భాగం ఉచ్చ స్థానంగా ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ పడమర దిక్కున ఉండే స్థానం నీచ స్థానం గా చెప్పబడుతోంది. ఆ వైపు ఎలాంటి ద్వారాలు, గేట్లు పెట్టకూడదు. ఇక ఉత్తరం దిక్కున ద్వారం కానీ, గేటు కానీ పెట్టుకోవాలంటే ఉత్తర ఈశాన్యం ని తాకుతూ తూర్పుదిశగా ఉండే ఉచ్ఛస్థానంలో ఏర్పాటు చేసుకోవాలి.

పడమర, దక్షిణం వైపు ఉచ్ఛ, నీచ స్థానాలివే

పడమర, దక్షిణం వైపు ఉచ్ఛ, నీచ స్థానాలివే

ఇక పడమర గోడ విషయానికి వస్తే దీనిని మూడు భాగాలుగా విభజిస్తే పడమర వాయువ్యం ని తాకుతూ ఉత్తరం లో ఉండే భాగం ఉచ్ఛ స్థానంగా, దక్షిణాన్ని తాకుతూ పడమర నైరుతిలో ఉండే భాగం నీచ స్థానంగా చెప్పబడుతోంది. ఇక దక్షిణం గోడ విషయంలో తూర్పుదిశగా దక్షిణ ఆగ్నేయాన్ని తాకే భాగం ఉచ్చ స్థానంగా, పడమర వైపుగా దక్షిణ నైరుతిని తాకుతూ ఉండే స్థానం నీచ స్థానం గాను చెప్పబడుతుంది.

తలుపులు, గేట్లు ఉచ్ఛ స్థానంలో ఉంటేనే ఇంట్లోని వారికి ఉన్నతి

తలుపులు, గేట్లు ఉచ్ఛ స్థానంలో ఉంటేనే ఇంట్లోని వారికి ఉన్నతి

అందుకే ఇంటికి తలుపులు, గేట్లు ఏర్పాటు చేసుకునే విషయంలో ఉచ్చ స్థానానికి ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేస్తారు. అటువంటి ద్వారాలు, గేట్ల ద్వారా నడక సాగితే జీవితం కూడా ఉచ్చ స్థితిలో ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లోని వారికి ఉన్నతి లభిస్తుందని చెప్తారు. అందుకే వాస్తు శాస్త్రంలో స్థలానికి కానీ, ఇళ్లకు కానీ ఉచ్చ, నీచ స్థానాలను తెలుసుకోవడం ఎంతో అవసరమని చెప్పబడింది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Vastu tips: పటికతో వాస్తు దోషాలకు చెక్; ప్రతికూల శక్తులు పరార్!!Vastu tips: పటికతో వాస్తు దోషాలకు చెక్; ప్రతికూల శక్తులు పరార్!!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *