బృహస్పతి సంచారంతోకలిసొచ్చే రాశులు ఇవే

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బృహస్పతిని దేవతల గురువుగా సూచిస్తారు. ఇతర గ్రహాల మాదిరిగానే బృహస్పతి సంచారం మనుషుల జాతకాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహంగా పరిగణించబడే బృహస్పతి హోలీ తర్వాత కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. బృహస్పతి వల్ల శుభ ఫలితాలను పొందే ఆ రాశులను గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా మూడు రాశుల వారికి బృహస్పతి అదృష్టాన్ని ఇస్తాడని చెప్పబడింది. బృహస్పతి సంచారంతో మేషరాశి, కర్కాటక రాశి, మీన రాశి జాతకులకు బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు.

మేషరాశి వారికి అదృష్టం

మేషరాశి వారికి అదృష్టం

మేష రాశి జాతకులకు బృహస్పతి 9వ, 12వ ఇంట సంచరించడం వల్ల 2023లో బృహస్పతి సంచార సమయంలో మేష రాశి వారి జీవితంలో ముఖ్యమైన కొన్ని సంఘటనలు సంభవించవచ్చునని, హోలీ తరువాత వారికి బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. మేషరాశి బృహస్పతికి స్నేహితుడు కాబట్టి, మేషరాశిలో బృహస్పతి సంచారం అన్ని విధాలుగా లాభదాయకంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మేషరాశి జాతకులు హోలీ పండుగ తర్వాత పిల్లల గురించి శుభవార్తలు వింటారు. ప్రేమ విషయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా లాభదాయకంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు వివాహాలు చేసుకోవడానికి ఈ సమయం అనుకూలం. ఈ కాలంలో వివాహితుల జీవితాలలో కొనసాగుతున్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

 కర్కాటక రాశి జాతకులపై బృహస్పతి సానుకూల ప్రభావం

కర్కాటక రాశి జాతకులపై బృహస్పతి సానుకూల ప్రభావం

ఇక కర్కాటక రాశి జాతకులపై కూడా బృహస్పతి ప్రభావం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆరవ మరియు తొమ్మిదవ గృహాలకు అధిపతి అయిన బృహస్పతి పదవ ఇంట్లో సంచరించడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఉన్నవారు ఈ సమయంలో అభివృద్ధి చెందటానికి వీలుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు ఈ సమయంలో బాగా ఉంటాయి. అంతేకాదు హోలీ తర్వాత ఎక్కువ ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

మీనరాశి జాతకులకు బృహస్పతి సంచారంతో అన్నీ శుభాలే

మీనరాశి జాతకులకు బృహస్పతి సంచారంతో అన్నీ శుభాలే

మీన రాశి జాతకులకు కూడా హోలీ తర్వాత బాగా కలిసి వస్తుంది. మీన రాశి జాతకులకు బృహస్పతి పదకొండవ ఇంటికి అధిపతి అంతేకాదు ఆయన మీన రాశికి అధిపతి. అయితే హోలీ తరువాత బృహస్పతి మీనరాశి యొక్క రెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో మీన రాశి జాతకుల ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినా, మీరు మాత్రం ముందుకు దూసుకుపోతారు. బంధుమిత్రులతో సంబంధాలు బలంగా మారుతాయి . ఇంట్లో వివాహానికి సంబంధించి సంతోషకరమైన వార్తలను వినవచ్చు. హోలీ తర్వాత మీనరాశి జాతకులకు బృహస్పతి సంచారం సంతోషాన్ని, శ్రేయస్సును ఇస్తుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *