News
lekhaka-Bhusarapu Pavani
Vedanta:
బిలియనీర్
అనిల్
అగర్వాల్
కు
చెందిన
వేదాంత
రిసోర్సెస్
లిమిటెడ్
ఓ
కీలక
ప్రకటన
చేసింది.
తమకు
సంబంధించిన
పెద్ద
మొత్తం
రుణాన్ని
తిరిగి
చెల్లించినట్లు
పేర్కొంది.
మొత్తం
800
మిలియన్
డాలర్ల
విలువైన
అప్పులు
తీర్చినట్లు
వెల్లడించింది.
వడ్డీ
రేట్లు
పెరిగిన
తర్వాత
కంపెనీ
లిక్విడిటీ
గురించి
ఆందోళన
నెలకొన్న
తరుణంలో
సంస్థ
ఈ
నిర్ణయం
తీసుకుంది.
లండన్
కు
చెందిన
మూడు
సంస్థలకు
వేదాంత
రుణాలు
తిరిగి
చెల్లించినట్లు
తెలిపింది.
వీటిని
లండన్
మరియు
హాంకాంగ్
లోని
స్టాండర్డ్
చార్టర్డ్
బ్యాంక్
నుంచి
తీసుకున్నట్లు
కంపెనీ
తన
ఎక్స్ఛేంజ్
ఫైలింగ్
లో
వివరించింది.
ఈ
రీపేమెంట్స్
వల్ల
తమ
అనుబంధ
యూనిట్
వేదాంత
లిమిటెడ్
షేర్లపై
ఉన్న
భారం
కొంత
మేరకు
తీరినట్లయింది.
గత
నెలలోనూ
చెల్లించాల్సిన
అన్ని
రుణాలు
మరియు
బాండ్లను
పే
చేసి,
స్థూల
రుణాన్ని
6.8
బిలియన్
డాలర్లకు
తగ్గించుకుంది.

వేదాంత
రిసోర్సెస్
దాని
భారతీయ
యూనిట్ల
నుంచి
రానున్న
భారీ
డివిడెండ్
లపై
ఆధారపడింది.
చెల్లింపు
తేదీ
దగ్గరపడిన
రుణాల
పేమెంట్స్
కోసం
గత
ఆర్థిక
సంవత్సరంలో
రికార్డు
మొత్తాలను
తీసుకుంది.
అయితే
ఈ
నెలలో
డాలర్
నోట్లను
ఎలా
మేనేజ్
చేస్తుందోనని
మార్కెట్
వర్గాలు
గమనిస్తున్నాయి.
దీనికితోడు
2024లో
మెచ్యూర్
కానున్న
దాదాపు
2
బిలియన్
డాలర్ల
బాండ్‌లు
రూపంలో
మరో
పెద్ద
రుణం
రాబోతున్న
తరుణంలో
కంపెనీ
ప్రణాళికలు
ఏ
విధంగా
ఉండనున్నాయోనని
పలువురు
దృష్టి
సారిస్తున్నారు.
English summary
Vedanta Resources repays dollar 800 Mn loans
Vedanta Resources repays $800 Mn loans.
Story first published: Sunday, May 7, 2023, 7:44 [IST]