[ad_1]
ఏమిటీ ఈ విండ్‌ఫాల్ పన్ను?
చమురు సంస్థలు ఎటువంటి అభివృద్ధి చర్యలు చేపట్టకుండానే పరిస్థితుల కారణంగా భారీ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వాలు వారి నుంచి వన్‌టైం పన్నుగా ఈ విండ్‌ఫాల్ సుంకాన్ని సేకరిస్తాయి. తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోగానే దీన్ని రద్దు చేస్తాయి.
రష్యా నుంచి కారు చౌకగా…
భారత్ ప్రధాన ఆయిల్ వినియోగదారు. దైనందిన అవసరాల కోసం ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి.
అది మన మిత్ర దేశం కావడం వల్ల వేరెవ్వరికీ లేని అతి తక్కువ ధరకు మనకు చమురు అందిస్తోంది. తద్వారా ఆయిల్ కంపెనీలకు అధిక మొత్తంలో ఆదాయం లభిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జూలైలో ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్ను విధించింది. అందులో ఇప్పుడు కొంత మేర సడలింపు ఇచ్చింది.
ఎవరికి లాభం?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా నయారా ఎనర్జీలు ఇతర దేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేస్తున్న పెద్ద సంస్థలు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ రెండూ లాభపడనున్నాయి.
[ad_2]
Source link
Leave a Reply