Windfall Tax: సంతోషంలో చమురు కంపెనీలు.. టాక్స్ తగ్గించిన కేంద్రం.. సామాన్యులకు ఊరట..?

[ad_1]

పన్ను తగ్గింపుల ఇలా..

కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.4,900 గా విధిస్తున్న విండ్ ఫాల్ టాక్సును తాజాగా రూ.1,700లకు తగ్గించింది. దీని కారణంగా దేశీయ రిఫైనరీలు ఇంధనాన్ని మరింత చవకగా ఎగుమతి చేసేందుకు వెసులుబాటు ఏర్పడింది. దీనికి తోడు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై పన్నును లీటర్‌కు రూ.5 నుంచి రూ.1.5కి తగ్గించింది. దీనివల్ల రానున్న కాలంలో విమాన ఛార్జీలు సైతం తగ్గే అవకాశం ఉందని ఏవియేషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రయాణికులపై భారాన్ని కూడా తగ్గిస్తుంది.

లాభపడనున్న కంపెనీలు..

లాభపడనున్న కంపెనీలు..

కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తీసుకున్న విండ్ ఫాల్ టాక్స్ తగ్గింపు నిర్ణయం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని చమురు ఎగుమతిదారులకు భారీగా లాభాలను చేకూర్చనుంది. అందుకే నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లు అత్యధికంగా లాభపడింది. ఇంధన ధరలు ఎగుమతుల కారణంగా పెరగకుండా ఉంచేందుకు కేంద్రం గతంలో దీనిని పెంచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో దానికి అనుగుణంగా పన్నులను కేంద్రం తగ్గించింది.

 ఈ నెలలో ఎక్కువ ఊరట..

ఈ నెలలో ఎక్కువ ఊరట..

తాజాగా పన్ను తగ్గింపు అమలులోకి వచ్చినప్పటికీ దీనికి ముందు డిసెంబర్ 1న సైతం కేంద్రం విండ్ ఫాల్ టాక్స్ ను తొలిసారి తగ్గించింది. అప్పట్లో టన్నుకు రూ.10,200 నుంచి రూ.4,900కి టాక్సును కేంద్రం తగ్గించింది. చైనాలో కరోనా తీవ్రంగా ఉన్నందున ఉత్పాదక రంగం నెమ్మదించటంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చమురు వినియోగం తగ్గింది. డిమాండ్ తగ్గినందున ప్రస్తుతం క్రూడ్ ధరలు సైతం దానికి అనుగుణంగా తగ్గుముఖం పడుతున్నాయి.

 జూలైలో రికార్డు స్థాయికి పన్ను..

జూలైలో రికార్డు స్థాయికి పన్ను..

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో భారత ప్రభుత్వం జూలై1న భారీగా విండ్ ఫాల్ టాక్స్ విధించింది. దీంతో టన్నుకు ఏకంగా రూ.23,250 పన్నును విధించింది. కానీ తాజా ప్రకటనతో.. ONGC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, చెన్నై పెట్రోలియం కార్ప్, మంగళూరు రిఫైనరీ సహా అనేక చమురు రంగంలోని కంపెనీలు తాజా తగ్గింపులతో భారీగా లాభపడనున్నయి. అయితే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం సమయంలో సామాన్యులు సైతం తగ్గింపులను కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతూనే ఉన్నప్పటికీ తమకు మాత్రం ఆ తగ్గింపులు అందటం లేదని పెదవి విరుస్తున్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రకటన చేసి.. పెట్రోల్, డీజిల్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *