[ad_1]
News
oi-Lekhaka
By Lekhaka
|
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో.. 73 మంది సీనియర్లకు ప్రమోషన్ కల్పించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను ఉద్యోగుల అట్రిషన్ రేటు 23 శాతం ఉండగా.. ఉన్నత స్థాయి ఉద్యోగులను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి, మరో 61 మంది ఎగ్జిక్యూటివ్‌లను వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ప్రమోట్ చేసింది. ఈ మార్పులతో మొత్తంగా 200 మంది వీపీ మరియు ఎస్‌వీపీ స్థాయి ఉద్యోగుల పర్యవేక్షణలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగించనుంది.
ఉద్యోగుల భాగస్వామ్యం పెంచేందుకే..
కంపెనీ ఎదుగుదలలో ఉద్యోగులను భాగం చేసేందుకు, వారిలో నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. వీపీ ప్రమోషన్లు ఈ స్థాయిలో ఇవ్వడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇవి వారి ప్రతిభకు, సామర్థ్యానికి విప్రో గుర్తింపునిస్తుందనడానికి నిదర్శనమని తెలిపింది. వేలాది మంది ఇతర సాధారణ ఉద్యోగులకు సైతం పదోన్నతులు కల్పించినట్లు చెప్పింది.
ఆపరేషన్ ఆకర్ష్:
గత కొంతకాలంగా అధిక అట్రిషన్ రేటుతో విప్రో సతమతమవుతోంది. గత రెండు క్వార్టర్‌లలోనూ దాదాపు 20 శాతానికి పైగా ఉద్యోగులు సంస్థను వీడారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల ద్వారా ఉన్న ఉద్యోగులను ఆకర్షించాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలు రానున్న కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయో వేచిచూడాలి మరి…!
English summary
Wipro promoted 73 executive level employees to vp status.
Wipro plans to contain employee attrition
Story first published: Thursday, January 12, 2023, 20:12 [IST]
[ad_2]
Source link