లింగవివక్షను హైలెట్ చేస్తూ..
‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను పురస్కరించుకుని సిమెంట్ కంపెనీ దాల్మియా భారత్ లిమిటెడ్ ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘#homemaker’ పేరిట దీనిని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో జరుపుతోంది. ‘హోమ్ మేకర్’ అనే పదానికున్న సాధారణ, సాంప్రదాయక అర్థంలో తేడాని వివరిస్తోంది.
తద్వారా ఆయా వ్యాపారాలు, ఉద్యోగాల్లో చూపుతున్న లింగవివక్షను హైలెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకు. మహిళల్లోని నైపుణ్యాలను సైతం గుర్తించి, అన్ని రంగాల్లో వారికి అవకాశాలు అందించే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

టీజర్లు, షార్ట్ ఫిల్మ్స్
వరుస టీజర్లు, మహిళల అనుభవాలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఈ ప్రచారాన్ని కంపెనీ ముందుకు తీసుకు వెళ్తోంది. ‘Because I’m that woman who chooses to be a #homemaker’ అనే ట్యాగ్ లైన్ జతచేసింది. నిర్మాణ రంగంలోని మహిళలు తమ భవిష్యత్తును ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారో అన్న విషయాన్ని ఓ వీడియోలో చూపించింది.
మొదట ఓ మహిళను గృహిణిగా, ఇంజనీర్, కాంట్రాక్టర్, ఇళ్ల ఆర్కిటెక్ట్ గా మరోచోట చూపించింది. ఈ ప్రచారం ముఖ్యంగా లింక్డ్ ఇన్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సప్ లలో మార్చి నెలాఖరు వరకు జరగనుంది.
నిర్మాణ రంగంలోకి సాదర స్వాగతం
“నిర్మాణ రంగాన్ని క్షుణ్ణంగా గమనిస్తే, అది పూర్తిగా పురుషాధిక్యతో నిండి ఉంటుంది. భారత్ లో కేవలం 12 శాతం మంది మహిళలు మాత్రమే ఇందులో పనిచేస్తున్నారు. అవకాశాల కొరత కారణంగా వారు ఈ రంగాన్ని ఎంచుకోవడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఆ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాం. ప్రస్తుతం మేము ప్రారంభించిన ప్రచారం ద్వారా వారిని ఈ రంగంవైపు, మా సంస్థవైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాం” అని దాల్మియా భారత్ లిమిటెడ్ కు చెందిన ఓ అధికారి తెలిపారు.