PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

YES Bank: గుడ్ న్యూస్ చెప్పిన యెస్ బ్యాంక్.. అందుకే మార్కెట్లో స్టాక్ దూకుడు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

YES Bank: ఎప్పటి నుంచో చతికిలపడిన యెస్ బ్యాంక్ షేర్లలో గత కొన్ని వారాలుగా చలనం మెుదలైంది. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్లో.. షేరు దూకుడు పెంచింది.

ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే యెస్ బ్యాంక్ షేర్లు ఎన్ఎస్ఈలో 4.25 శాతం పెరిగి రూ.22.10కి చేరుకున్నాయి. ఈ పెరుగుదలకు వెనుక ఉన్న కారణాన్ని శనివారం బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. బ్యాంక్ ఇచ్చిన వివరాల ప్రకారం తనకు ఉన్న రూ.48,000 కోట్ల రుణాన్ని డెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీ జెసి ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు బదిలీ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ 1-నవంబర్ 30 వరకు చేసిన లోన్ రికవరీ కూడా సర్దుబాటు చేయబడింది. ఈ వార్త కంపెనీ ఇన్వెస్టర్లలో కొత్త జోన్ నింపింది.

 YES Bank: గుడ్ న్యూస్ చెప్పిన యెస్ బ్యాంక్.. అందుకే మార్కెట

దీనికి ముందు గత నెలలో కంపెనీ షేర్ ఏకంగా 30 శాతానికి పైగా పెరిగింది. డిసెంబర్ 7న కంపెనీ ఒక్కో షేరు ధర రూ.17.45 వద్ద ఉంది. కానీ కేవలం 9 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ ధర రూ.21.75కు చేరుకుంది. ప్రస్తుతం యెస్ బ్యాంక్ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.24.75గా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రూ.21.45 వద్ద కొనసాగుతోంది.

ఈ మధ్య కాలంలో యెస్ బ్యాంక్ షేర్లు ర్యాలీని చూశాయని జీసీఎల్ సెక్యూరిటీస్ సీఈవో రవి సింఘాల్ అన్నారు. మీడియం టర్మ్ టార్గెట్ రూ.33ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు రూ.19-18 ధర మధ్య కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఇదే క్రమంలో స్టాక్ దీర్ఘకాలిక టార్గెట్ ధర రూ.44గా ఉంటుందని అన్నారు. బ్యాడ్ లోన్లను వదిలించుకునేందుకు యెస్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నం కంపెనీపై ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. కొన్ని సంవత్సరాల కిందట యెస్ బ్యాంక్ మెుండి బకాయిలు భారీగా పెరగటంతో కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించిన సంగతి తెలిసిందే.

English summary

Yes bank stock gained amid bank cleaning bad debts from books know details

Yes bank stock gained amid bank cleaning bad debts from books know details

Story first published: Monday, December 19, 2022, 14:38 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *