[ad_1]
బాలాసనం..
బాలాసనం ఛాతీలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వెన్నెముకను సడలిస్తుంది, భుజాలు చేతుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. బాలాసనం స్ట్రెస్‌ను తగ్గించి నిద్ర ప్రశాంతంగా పట్టేలా చేస్తుంది.
ఎలా వేయాలి..?
బాలాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకుని… మోకాలు, కుడి చేతిని పక్కకు మడిచిపెట్టాలి. ఎడమ కాలు, ఎడమ చేయి కిందికి తిన్నగా ఉంచేసి రిలాక్స్ అవుతున్నట్లు పడుకోవాలి. ఈ ఆసనం రోజూ నిద్రపోయే ముందు వేస్తే.. మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
శవాసనం..
శవాసనం నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. జీర్ణ, రోగనిరోధక వ్యవస్థలకు మేలు చేస్తుంది. ఒత్తిడి, తలనొప్పి, అలసట, ఆందోళనను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎలావేయాలి..?
యోగా మ్యాట్‌పై కాళ్లు, చేతులు చాపి వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని పూర్తి రెస్ట్ పొజిషన్‌లో ఉంచాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఎలాంటి ఆలోచనలనూ మనసులోకి రానీయకుండా ఓ రెండు మూడు నిమిషాలు ఈ స్థితిలో ఉండి చూడండి. ఈ ఆసనం రోజూ వేస్తే.. నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
పాదహస్తాసనం..
పాదహస్తాసనం, స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ భంగిమ జీర్ణ అవయవాలను మసాజ్ చేస్తుంది. అపానవాయువు, మలబద్ధకం, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ముక్కు, గొంతు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇలా వేయండి..
ఈ ఆసనం వేయడాని ముందుగా నిటారుగా నిలబడండి. ఆ తర్వాత మెల్లగా చేతులను పైకి లేపి.. గాలిని నెమ్మదిగా వదిలేస్తూ నడుమును వంచుతూ రెండు చేతులతో రెండు కాళ్ల మునివేళ్లను తాకాలి. అలా 10-30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత సాధారణ స్థితికి రావాలి.
బద్ద కోణాసనం..
బద్ధకోణాసనం తొడలు, గజ్జలు, మోకాళ్ల వశ్యతను మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేస్తుంది, జీర్ణ సమస్యలను నయం చేస్తుంది.
ఎలా వేయాలి..
సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్టుగా రెండు అరికాళ్లను వేగంగా ఆడించాల్సి ఉంటుందీ ఆసనంలో.
ఉత్తానాసనం..
ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు చేతులను కిందకు దించుతూ, మోకాళ్లను వంచకుండా నేలను తాకించాలి. తలనూ మోకాళ్ల వరకు తీసుకురావాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply