PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

[ad_1]

Top Mutual Funds 2023: ఈ సంవత్సరం (2023) మ్యూచువల్ ఫండ్స్‌కు చాలా బాగా గడిచింది. డిసెంబరు మొదటి వారం అప్పుడే పూర్తయింది, ఈ సంవత్సరాంతానికి ఇక 3 వారాలే మిగిలుంది. మ్యూచువల్ ఫండ్స్ కోణంలో ఈ ఏడాదిని పరిశీలిస్తే, ఈ మాధ్యమం ద్వారా పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీ లాభాలు సంపాదించారు.

స్టాక్‌ మార్కెట్‌ రికార్డ్స్‌
స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే, 2023 సంవత్సరం చరిత్రాత్మకంగానూ ముఖ్యమైంది. ఈ ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Indian stock market performance in 2023) అనేక ప్రధాన సూచీలు ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగాయి. శుక్రవారం (08 డిసెంబర్‌ 2023) ట్రేడింగ్‌లోనూ మార్కెట్‌లో కొత్త రికార్డులు క్రియేట్‌ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సరికొత్త జీవితకాల గరిష్టాన్ని ‍‌(Bank Nifty Index hits new all-time high) నమోదు చేసింది. నిఫ్టీ కూడా తొలిసారిగా 21,000 మార్క్‌ దాటి కొత్త గరిష్ట స్థాయిని (Nifty new all-time high) తాకింది.

30 శాతం పైగా రాబడి (Mutual funds performance in 2023)
స్టాక్ మార్కెట్‌లోని ఈ ర్యాలీ నుంచి సహజంగానే మ్యూచువల్ ఫండ్స్ లాభపడ్డాయి. వివిధ రంగాల స్టాక్స్‌ అద్భుత ప్రదర్శన చేయడంతో, ఫండ్ హౌస్‌ల వివిధ పథకాల పని తీరు కూడా అలాగే ఉంది. 2023 అక్టోబర్ వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాలు 52 శాతం వరకు రాబడి ఇచ్చాయి. దాదాపు, ప్రతి కేటగిరీలోని అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఈ ఏడాది 30 శాతం పైగా రిటర్న్స్‌ ఇచ్చాయి.

2023 అక్టోబర్‌ వరకు, వివిధ కేటగిరీల్లో అధిక రాబడి ఇచ్చిన 10 ఫండ్స్‌:

HDFC స్మాల్ క్యాప్ ఫండ్: 51.5%
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: 45.69%
HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్: 44.13%
నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్: 39.4%
మహీంద్ర మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్: 37.26%
SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్: 37.18%
నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్: 36.16%
నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: 34.57%
మహీంద్ర మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్: 33.79%
JM ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్: 30.91%

కొత్త శిఖరాగ్రాల్లో సెన్సెక్స్ & నిఫ్టీ
NSE నిఫ్టీ ఈ ఏడాదిలోనే తొలిసారిగా 20,000 మార్కును కూడా దాటింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 శాతానికి పైగా బలపడింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ50 ఇండెక్స్‌ 21,000 పాయింట్లకు సమీపంలో స్థిరపడింది. ట్రేడింగ్‌ సమయంలోనే 21k మైలురాయిని అధిగమించింది.

BSE సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14 శాతం ఎగబాకి 70,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. 

శుక్రవారం ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ 47,170 పాయింట్లను అధిగమించింది. ఈ వారంలో (04-08 డిసెంబర్‌) బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 5 శాతానికి పైగా పెరిగింది. 2022 జులై తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఇదే అతి పెద్ద వీక్లీ గెయిన్‌.

స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్ సూచీలు వాటి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *