PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ TCS, MCX, Bajaj Auto

[ad_1]

Stock Market Today, 11 October 2023: మంగళవారం ఇండియన్‌ ఈక్విటీలు లాభాల్లో ముగిశాయి. అయితే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు మూమెంట్‌పై నిఘా ఉంచుతూ, స్పష్టమైన దిశానిర్దేశం కోసం గ్లోబల్‌ మార్కెట్ల వైపు చూస్తున్నాయి. 

లాభాల్లో అమెరికన్‌ స్టాక్స్
వాల్ స్ట్రీట్ ఇండెక్స్‌లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. U.S. ఫెడరల్ రిజర్వ్ అధికారుల డోవిష్‌ వ్యాఖ్యల తర్వాత ట్రెజరీ ఈల్డ్స్‌ తగ్గాయి. 

లాభాల బాటలో ఆసియన్‌ స్టాక్స్
US ఈక్విటీలు ఊపందుకోవడంతో ఆసియా మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. అతి పెద్ద ర్యాలీ తర్వాత ముడి చమురు నిలకడగా ఉంది.

ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 13.5 పాయింట్లు లేదా 0.07 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,790 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: ఈ సాఫ్ట్‌వేర్ మేజర్ తన సెప్టెంబరు త్రైమాసిక ఆదాయాలను (Q2 FY24) ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత ప్రకటిస్తుంది. మార్కెట్‌ ఎనలిస్ట్‌ల సగటు అంచనాల ప్రకారం, కంపెనీ ఏకీకృత ఆదాయం కేవలం 1.4% QoQ వృద్ధితో రూ. 60,218 కోట్లకు పెరుగుతుంది, నికర లాభం 3% QoQ పెరుగుదలతో రూ. 11,404 కోట్లకు చేరుకుంటుంది.

షేర్ల బైబ్యాక్‌ను కూడా టీసీఎస్‌ బోర్డు ఈ రోజు పరిశీలిస్తుంది, ఆమోదిస్తుంది. బై బ్యాంక్‌ కోసం కోసం రూ. 18,000 కోట్లు ఖర్చు చేస్తుందని మార్కెట్ అంచనా వేసింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) : ఈ ఎక్స్ఛేంజ్ సోమవారం నుంచి కొత్త కమోడిటీ డెరివేటివ్ ప్లాట్‌ఫామ్‌తో లైవ్‌ అవుతుంది. అక్టోబర్ 15న మాక్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తుంది.

బజాజ్ ఆటో: బజాజ్‌ ఆటో & UK భాగస్వామి ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌తో కలిసి Triumph Scrambler 400 x”ని లాంచ్‌ చేసింది. ఈ రెండు వాహన కంపెనీలు జాయింట్‌గా డెవలప్‌ చేసిన రెండో మోటార్‌బైక్ ఇది. దీని ధర ఎక్స్-షోరూమ్‌లో రూ. 2,62,996, నుంచి ప్రారంభమవుతుంది.

ఎల్‌టీఐమైండ్‌ట్రీ: SAP సేవలను అమలు చేయడానికి Infineon Technologies AG కంపెనీని వ్యూహాత్మక భాగస్వామిగా ఎల్‌టీఐమైండ్‌ట్రీ ఎంపిక చేసింది.

ఫీనిక్స్ మిల్స్‌: ఈ కంపెనీకి చెందిన ఐదు అనుబంధ సంస్థలు రూ. 14.4 కోట్లతో పన్ను డిమాండ్ నోటీసును అందుకున్నాయి. ఈ కేసును కోర్టులో ఛాలెంజ్‌ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

HDFC అసెట్ మేనేజ్‌మెంట్: అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్‌ ఇండియా (ఆంఫీ) బోర్డు, ప్రస్తుత MD & CEO నవనీత్ మునోట్‌ను అసోసియేషన్ కొత్త ఛైర్మన్‌గా ఎన్నుకుంది.

సంవర్ధన మదర్సన్: గ్లోబల్ ఆటో కాంపోనెంట్ మేకర్, తన పూర్తి యాజమాన్యంలోని అసెట్ హోల్డింగ్ అనుబంధ సంస్థగా ‘మదర్సన్ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్స్ USA Inc’ని ఏర్పాటు చేసింది. ఇది గ్రూప్‌ కంపెనీల నుంచి చర, స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తుంది, పెట్టుబడులు పెడుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంక్‌ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ‘బాబ్ వరల్డ్’లో కొత్త క్లయింట్‌లను చేర్చుకోకుండా ప్రభుత్వ యాజమాన్యంలోని లెండర్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆదేశించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: గవర్నమెంట్‌ రన్‌ చేస్తున్న పెన్షన్ స్కీమ్స్‌, నెలానెలా గ్యారెంటీ మనీ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *