Stock Market Today, 01 December 2023: భారతదేశ Q2 GDP డేటా, అందరూ ఆశించిన దాని కంటే చాలా మెరుగ్గా ఉండడంతో ఈ రోజు ఇండియన్‌ ఈక్విటీలు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో, భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) RBI అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువగా 7.6 శాతానికి పెరిగింది.

గురువారం US మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. డౌ జోన్స్ 1.5 శాతం పెరిగితే, నాస్‌డాక్ రెడ్‌ కలర్‌లో క్లోజ్‌ అయింది. ఈ రోజు, US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగంతో పాటు తయారీ & నిర్మాణ రంగాల డేటాపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది. 

ఆసియాలో మార్కెట్లలో… కోస్పి దాదాపు 1 శాతం పడిపోయింది. నికాయ్‌, తైవాన్ కూడా కొద్దిగా రెడ్‌ కలర్‌లో ఉన్నాయి.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 12 పాయింట్లు లేదా 0.06% గ్రీన్‌ కలర్‌లో 20,350 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: ఈ స్టాక్ ఈరోజు మార్కెట్లలో అరంగేట్రం చేస్తుంది. గ్రే మార్కెట్ ప్రీమియాన్ని బట్టి ఈ షేర్లు 25 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్‌ను సూచిస్తున్నాయి. ఈ కంపెనీ IPOకి బలమైన స్పందన వచ్చింది, 49.3 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

అల్ట్రాటెక్ సిమెంట్, కేసోరామ్ ఇండస్ట్రీస్: కేసోరామ్‌తో సిమెంట్ వ్యాపారాన్ని ఆల్-స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

JSW గ్రూప్: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్, చైనాకు చెందిన SAIC మోటార్‌తో స్ట్రాటెజిక్‌ జాయింట్ వెంచర్‌పై సంతకం చేసింది, తద్వారా ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ జాయింట్ వెంచర్‌లో JSWకు 35 శాతం వాటా ఉంటుంది.

డిఫెన్స్ స్టాక్స్: నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్ల ప్రాజెక్టులను ఆమోదించింది.

వర్ల్‌పూల్: అమెరికాకు చెందిన మాతృసంస్థ, భారతీయ విభాగమైన వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియాలో 24 శాతం వాటాను వచ్చే ఏడాది విక్రయించాలని యోచిస్తోంది.

టాటా కాఫీ: రూ.450 కోట్ల పెట్టుబడితో, వియత్నాంలోని అనుబంధ సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టాటా కాఫీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

పీవీఆర్ ఐనాక్స్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడితో మరో 150 కొత్త స్క్రీన్‌లను ఓపెన్‌ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు 23 చోట్ల 118 స్క్రీన్‌లు ఉన్నాయి.

హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్: వారణాసి-రాంచీ-కోల్‌కతా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం, ఈ కంపెనీ విభాగం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,303.11 కోట్ల ఆర్డర్‌ దక్కించుకుంది.

ఐటీడీ సిమెంటేషన్: ఆంధ్రప్రదేశ్‌లో సివిల్, హైడ్రో-మెకానికల్ పనుల కోసం రూ. 1,001 కోట్ల కాంట్రాక్టును గెలుచుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ – జీవన్‌ ఉత్సవ్‌Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *