PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Sun Pharma, Infy, Dixon, DLF, Mankind

[ad_1]

Stock Market Today, 12 December 2023: సోమవారం ట్రేడింగ్‌లో, ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ ఎక్కడ ప్రారంభమయ్యాయో, దాదాపు అదే స్థాయిలో ముగిశాయి. ఈ రోజు (మంగళవారం, 12 డిసెంబర్‌ 2023) కూడా రేంజ్‌ బౌండ్‌ కొనసాగవచ్చు. ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత… ఇటు ఇండియాలో, అటు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణం డేటా (CPI inflation data‌) విడుదలవుతుంది. బుధవారం, అమెరికాలో వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడుతుంది. కాబట్టి, మార్కెట్లు ఈ రెండు రోజులు కీలక సూచనల ఆధారంగా ప్రతిస్పందిస్తాయి.

సోమవారం, యూఎస్‌ మార్కెట్స్‌ లాభాల్లో క్లోజ్‌ అయ్యాయి. డౌ జోన్స్‌ 0.43 శాతం లాభపడింది. S&P500 0.39 శాతం పెరిగింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.20 శాతం వృద్ధి చెందింది.

ఆసియా మార్కెట్లలో… నికాయ్‌, హ్యాంగ్ సెంగ్ 0.7 శాతం చొప్పున పెరిగాయి. CSI 300, కోస్పి, S&P/ASX 200 కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఇవి 0.05 శాతం నుంచి 0.4 శాతం మధ్యలో పెరిగాయి. 

ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01% గ్రీన్‌ కలర్‌లో 21,141 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఇన్ఫోసిస్: నిలంజన్ రాయ్ స్థానంలో జయేష్ సంఘ్‌రాజ్కా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పోస్ట్‌ అయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.

కోల్ ఇండియా: 2029-30 నాటికి, దేశంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి 1.5 బిలియన్ టన్నులకు చేరుతుందని బొగ్గు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఆ సమయానికి కోల్ ఇండియా ఉత్పత్తి 1.12 బిలియన్ టన్నులుగా ఉంటుందని లెక్కగట్టింది.

సన్ ఫార్మా: టారో ఫార్మాలో మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేయడానికి ఆఫర్ ప్రైస్‌ను ఒక్కో షేరుకు 43 డాలర్లకు పెంచింది. ఈ ధర ఇంతకుముందు 38 డాలర్లుగా ఉంది.

డిక్సన్ టెక్నాలజీస్: తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్‌ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) 2.0 స్కీమ్ కింద, ల్యాప్‌టాప్స్‌ & నోట్‌బుక్స్‌ తయారు చేయడానికి లెనోవా నుంచి కాంట్రాక్ట్‌ గెలుచుకుంది.

మ్యాన్‌కైండ్ ఫార్మా: ఈ కంపెనీలో 7.9 శాతం వాటా ఈ రోజు బ్లాక్‌ డీల్స్‌ ద్వారా అమ్ముడయ్యే అవకాశం ఉంది. డీల్ సైజ్‌ దాదాపు రూ.5,649 కోట్లుగా ఉండవచ్చు.

DLF: డీఎల్‌ఎఫ్‌ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వివేక్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఫిబ్రవరి 29 వరకు గ్రూప్ CFOగా కొనసాగుతారు.

స్పైస్‌జెట్: Q2 ఆదాయాలు, తాజా మూలధనాన్ని సమీకరించే ఆప్షన్స్‌ పరిశీలించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ రోజు సమావేశం అవుతుంది.

మహీంద్ర & మహీంద్ర: నవంబర్‌లో 69,875 యూనిట్లను ఉత్పత్తి చేసింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 13.4 శాతం పెరిగింది. మొత్తం అమ్మకాలు సంవత్సరానికి 24.6 శాతం పెరిగి 68,760 యూనిట్లకు చేరుకున్నాయి. అదే కాలంలో ఎగుమతులు 41.8 శాతం తగ్గి 1,816 యూనిట్లకు పడిపోయాయి.

జమ్మూ & కశ్మీర్ బ్యాంక్: రూ.750 కోట్లను సమీకరించడానికి QIP ప్లేస్‌మెంట్‌ ప్రారంభించింది. QIP కోసం ఒక్కో షేరు ఫ్లోర్ ధరను రూ.112.66గా నిర్ణయించింది. గత ముగింపుతో పోలిస్తే ఇది 10 శాతం డిస్కౌంట్‌.

BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్: కెనడాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా (HCI) నుంచి కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు పొందింది. 

సెజల్ గ్లాస్: కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన చంద్రకాంత్ వల్లభాజీ గోగ్రీ, 11.15 లక్షల ఈక్విటీ షేర్లను ఈ రోజు, రేపు ‘ఆఫర్ ఫర్ సేల్’ ద్వారా అమ్ముతారు.

కాప్రి గ్లోబల్ క్యాపిటల్: ఇన్సూరెన్స్ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి, రెగ్యులేటరీ అథారిటీ IRDAI నుంచి కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్‌ పొందింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *