[ad_1]
Stock Market Today, 13 December 2023: 2023 అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి (IIP growth rate) ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండడం, నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI inflation) ఊహించిన దాని కంటే తక్కువగా పెరగడం ఈ రోజు బుల్లిష్ ట్రిగ్గర్స్‌గా పని చేస్తాయి. అయితే, US ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ నిర్ణయాలు ఈ రోజు మన మార్కెట్లు క్లోజ్ అయ్యాక వెలువడతాయి. కాబట్టి, సెకండ్ సెషన్ అస్థిరంగా ఉంచవచ్చు.
లాభాల్లో యూఎస్ మార్కెట్లు
అమెరికాలో నవంబర్ ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా వచ్చిన తర్వాత, ఓవర్‌నైట్‌లో, S&P 500 0.46 శాతం పెరిగింది. డౌ జోన్స్ 0.48 శాతం లాభపడింది. నాస్డాక్ కాంపోజిట్ 0.70 శాతం గెయిన్ అయింది.
మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు
ఈ రోజు బిజినెస్ ప్రారంభంలో నికాయ్, ASX 200 0.6 శాతం వరకు అప్‌సైడ్‌లో ట్రేడవుతుండగా, కోస్పి, హ్యాంగ్ సెంగ్ తలో 0.3 శాతం తగ్గాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 05 పాయింట్లు లేదా 0.02% రెడ్ కలర్‌లో 21,067 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
విప్రో: ప్రపంచంలోని ప్రముఖ జనరల్ బీమా కంపెనీల్లో ఒకటైన RSAతో విప్రో ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. క్లౌడ్‌కు వేగంగా మారడానికి, ఐటీ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేసుకోవడానికి ఈ బీమా కంపెనీకి తోడ్పాటు అందిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్, ఈ రోజు, 444 మిలియన్ డాలర్ల విలువైన డీల్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ షేర్లను విక్రయించే అవకాశం ఉంది. బైన్ క్యాపిటల్ అనుబంధ సంస్థలు, ఈ బ్యాంక్‌లో 1.1 శాతం వాటాను అమ్మాలని చూస్తున్నాయి.
లారస్ ల్యాబ్స్: లారస్ ల్యాబ్స్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ లారస్ సింథసిస్‌కు చెందిన పరవాడ, అనకాపల్లిలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్లలో ఈ నెల 4-12 తేదీల్లో తనిఖీ చేసిన US FDA, ఐదు పరిశీలనలతో ఫారం 483 జారీ చేసింది.
SRF: నాలుగు కొత్త ప్లాంట్‌లలో రెండింటిని ప్రారంభించి, మొత్తం రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు SRF తెలిపింది. రూ.604 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న ఒక ఫ్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గతంలో ప్రకటించిన మూలధన వ్యయంలో ఇది ఒక భాగం.
బ్యాంక్ ఆఫ్ బరోడా: నిధుల సమీకరణను పరిశీలించేందుకు బ్యాంక్ మూలధన సమీకరణ కమిటీ ఈ నెల 15న సమావేశం అవుతుంది.
KIOCL: ఐరన్ ఓర్ ఫైన్స్ అందుబాటులో లేకపోవడంతో, తన మంగళూరు ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసింది.
ఇండియన్ బ్యాంక్: ఒక్కో షేరు ఫ్లోర్ ప్రైస్ రూ. 414.44 చొప్పున క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ప్లేస్‌మెంట్ (QIP) ప్రారంభించింది. జారీ ధరను ఈ నెల 15న కంపెనీ నిర్ణయిస్తుంది.
శిల్పా మెడికేర్: బెంగళూరులోని శిల్పా మెడికేర్ యూనిట్ VI, నోటిలో కరిగే ఔషధ వేఫర్‌లు తయారు చేయడానికి ఆస్ట్రేలియా TGA నుంచి అనుమతి పొందింది. ఆస్ట్రేలియాలో దాని ఓరల్ ఫిల్మ్ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఫోర్స్ మోటార్స్: టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన TP సూర్యలో 12.2 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు, ఒక సోలార్ ప్లాంట్ నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి సంస్థ బోర్డు ఆమోదించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: సూపర్ ప్రపోజల్, బాండ్ మార్కెట్‌లోకి మీక్కూడా ఎంట్రీ, 10 శాతం రిటర్న్స్!
[ad_2]
Source link
Leave a Reply