Stock Market Today, 08 January 2024: పెరుగుతున్న గ్లోబల్‌ టెన్షన్ల ప్రభావం ఈ రోజు (సోమవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ మీద పడే అవకాశం ఉంది.

గత వారాంతంలో, చైనా కంపెనీలపై ఆంక్షలు & తైవాన్‌కు ఆయుధ విక్రయాలకు ప్రతిస్పందనగా ఐదు US రక్షణ రంగ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. ఈ నెల 13న, డ్రాగన్‌ కంట్రీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

దక్షిణ కొరియా సముద్ర సరిహద్దు ప్రాంతం దగ్గర ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో కవ్వింపు చర్యలకు దిగింది.

ఈ ఉదయం ఆసియా మార్కెట్లు 0.8 శాతం వరకు పెరిగాయి. తైవాన్ 0.8 శాతం పెరిగింది. కోస్పి, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం చొప్పున ర్యాలీ చేశాయి.

గత శుక్రవారం, US మార్కెట్‌లో 10-వారాల విజయ పరంపర బ్రేక్‌ అయింది. అక్టోబర్ తర్వాత, S&P 500 చెత్త వీక్లీ పెర్ఫార్మెన్స్‌ చేసింది. ఈ రాత్రి యూఎస్‌ డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం వెలువడుతుంది.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.06% రెడ్‌ కలర్‌లో 21,767 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

టైటన్: డిసెంబర్ త్రైమాసికంలో (Q3 FY24) టైటన్ ఆదాయం 22 శాతం పెరిగింది. దేశీయ మార్కెట్‌లో జువెలరీ సెగ్మెంట్‌ 21 శాతం వృద్ధిని సాధించింది.

బజాజ్ ఆటో: ఈ రోజు షేర్ బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది.

టాటా స్టీల్: Q3లో, టాటా స్టీల్ ఇండియా ముడి ఉక్కు ఉత్పత్తి QoQ, YoYలో 6 శాతం పెరిగి 5.32 మిలియన్ టన్నులకు చేరుకుంది.

నైకా: ఫ్యాషన్‌ కంపెనీ నికర అమ్మకాలు, Q3లో, గత ఏడాది కంటే 20 శాతం పెరగొచ్చని అంచనా. BPC వర్టికల్ GMV వృద్ధిని 20 శాతం దాచొచ్చు. ఆదాయ వృద్ధి కూడా 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్: Q3లో, ఏకీకృత ప్రాతిపదికన మిడ్-సింగిల్-డిజిట్ వాల్యూమ్ వృద్ధిని ఈ కంపెనీ ఆశిస్తోంది.

అదానీ విల్మార్: కంపెనీ స్వతంత్ర్య అమ్మకాలు గతేడాది కంటే Q3లో 15 శాతం తగ్గాయి. అయితే, వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 6 శాతం పెరిగాయి.

మారికో: Q3లో, ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన లోయర్‌ సింగిల్ డిజిట్‌లకు పడిపోయిందని, ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ లోయర్‌ డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ను సాధించిందని కంపెనీ వెల్లడించింది.  

TVS మోటార్: ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టి, 500 మందికి ఉపాధి కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది.

నారాయణ హృదయాలయ: ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ భారత్‌లో ఆరోగ్య బీమా బిజినెస్‌ ప్రారంభించేందుకు IRDAI నుంచి అనుమతి పొందింది.

ఫెడరల్ బ్యాంక్: MD & CEO ఆఫీసర్ పదవికి కనీసం ఇద్దరి పేర్లతో తాజా లిస్ట్‌ పంపాలని ఫెడరల్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా: Q3లో, గ్లోబల్ డిపాజిట్లు 8.3 శాతం పెరిగినా QoQలో 0.3 శాతం తగ్గాయి. YoYలో, దేశీయ డిపాజిట్లు  6.3 శాతం, అడ్వాన్స్‌లు 13.4 శాతం పెరిగాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: దేశ సంపదలో మూడింట ఒక వంతు స్టాక్ మార్కెట్‌దే, 2 కోట్ల మంది మహిళల డబ్బుSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *