PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Delta Corp, Vedanta, Power Grid

[ad_1]

Stock Market Today, 10 January 2024: గ్లోబల్ మార్కెట్లలో బలహీనతకు అనుగుణంగా.. ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు (బుధవారం) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

నిన్న, యూఎస్‌ మార్కెట్లలో… డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 0.42 శాతం & 0.15 శాతం పడిపోయాయి, నాస్‌డాక్ కాంపోజిట్ 0.09 శాతం లాభపడింది. 

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నికాయ్‌ 1.7 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ 0.6 శాతం వరకు డౌన్‌ అయ్యాయి. హ్యాంగ్ సెంగ్ కోలుకుని 0.3 శాతం పెరిగింది.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 32 పాయింట్లు లేదా 0.15% రెడ్‌ కలర్‌లో 21,570 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

డెల్టా కార్ప్: FY24 Q3లో, కంపెనీ ఏకీకృత ఆదాయం 15 శాతం తగ్గి రూ. 231.7 కోట్లకు చేరుకుంది. నికర లాభం 59 శాతం క్షీణించి రూ.34.5 కోట్లకు చేరుకుంది.

వేదాంత: వేదాంత రిసోర్సెస్ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను Caa2 నుంచి Caa3కి; అన్‌సెక్యూర్డ్‌ బాండ్లపై రేటింగ్‌ను Caa3 నుంచి Caకి మూడీస్ తగ్గించింది. ఔట్‌లుక్ ప్రతికూలంగా పేర్కొంది.

KIOCL: ఐరన్‌ ఓర్‌ ఫైన్స్‌ అందుబాటులో లేకపోవడంతో మంగళూరులో ఉన్న పెల్లెట్ ప్లాంట్‌లో కార్యకలాపాలను ఈ కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది.

పవర్ గ్రిడ్: ఈ రోజు రూ. 2200 కోట్ల వరకు సమీకరించడానికి కంపెనీ బాండ్ల ఇష్యూకు ప్లాన్ చేస్తుందని నేషనల్‌ మీడియాలో రిపోర్ట్స్‌ వచ్చాయి. రూ.1700 కోట్ల గ్రీన్‌షూ ఆప్షన్‌తో, బేస్ సైజ్ రూ.500 కోట్లుగా వార్తల్లో ఉంది.

మహీంద్ర & మహీంద్ర: సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ & ఫుల్-స్టాక్ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను రూపొందించడం కోసం, అమెరికాకు చెందిన ఆటోమొబైల్ టెక్నాలజీ కంపెనీ Mobileyeతో ఒప్పందం చేసుకుంది.

పవర్ ఫైనాన్స్ కార్ప్: గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో ఫైనాన్స్ కంపెనీని ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి నిరభ్యంతర లేఖను అందుకుంది.

లుపిన్: US FDA ఆమోదం రావడంతో, బ్రోమ్‌ఫెనాక్ ఆప్తాల్మిక్ సొల్యూషన్‌ను అమెరికన్‌ మార్కెట్‌లోకి ఈ కంెపనీ లాంచ్‌ చేసింది.

IRCTC: సంజయ్ కుమార్ జైన్‌ను కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రైల్వే మంత్రిత్వ శాఖ నామినేట్ చేసింది.

స్టీల్ స్ట్రిప్స్ వీల్స్: దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా, AMW ఆటో కాంపొనెంట్ లిమిటెడ్‌లో రూ. 138 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: LIC Policy: ప్లాన్‌ ఒకటి, ప్రయోజనాలు మూడు – ఈ ఎల్‌ఐసీ పాలసీ బాగా పాపులర్‌

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *