Stock Market Today, 15 January 2024: గత ట్రేడింగ్‌ సెషన్‌లో (శుక్రవారం, 12 జనవరి 2024) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ప్రదర్శించిన బలం ఈ రోజు (సోమవారం, 15 జనవరి 2024) కూడా కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

చాలా లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు ఈ వారంలో Q3 FY24 ఆదాయాలను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, మన మార్కెట్‌ గ్లోబల్‌ సిగ్నల్స్‌తో పాటు కార్పొరేట్‌ రిజల్ట్స్‌ ప్రాతిపదికన కూడా కదులుతుంది. అంచనాలకు అనుగుణంగా Q3 రిజల్ట్స్‌ పోస్ట్‌ చేసిన టెక్‌ దిగ్గజాలు విప్రో, HCL టెక్‌ ఈ రోజు ఓపెనింగ్‌ ట్రేడ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

గ్లోబల్ మార్కెట్లు

జపాన్‌కు చెందిన నికాయ్‌ మినహా చాలా ఆసియా మార్కెట్లు ఈ ఉదయం క్షీణించాయి. నికాయ్‌ 0.57 శాతం పెరిగింది. హాంగ్ సెంగ్ 0.8 శాతం పడిపోయింది. ASX 200, కోస్పి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. 

శుక్రవారం, అమెరికన్‌ మార్కెట్లలో, డౌ జోన్స్ 0.31 శాతం తగ్గింది. S&P 500, టెక్‌ కంపెనీల సమాహారం నాస్‌డాక్ వరుసగా 0.08, 0.02 శాతం చొప్పున పెరిగాయి.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 5 పాయింట్లు లేదా 0.02% గ్రీన్‌ కలర్‌లో 22,048 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఏంజెల్ వన్, బ్రైట్‌కామ్ గ్రూప్, ఛాయిస్ ఇంటర్నేషనల్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, కేసోరామ్ ఇండస్ట్రీస్, PCBL. వీటిపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.

విప్రో: 2023 డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 2,700 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే (YoY) 12 శాతం తగ్గింది, గత త్రైమాసికం కంటే (QoQ) 1.2 శాతం పెరిగింది. ఈ టెక్‌ కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో, జనవరి 12న, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విప్రో అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్‌ 17 శాతం పెరిగాయి.

HCL టెక్‌: మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం పెరిగి రూ. 28,446 కోట్లకు చేరుకుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 6.7 శాతానికి చేరుకుంది. Q3FY21 తర్వాత అత్యధిక రాబడి వృద్ధిలో కనిపించిన త్రైమాసికాల్లో ఇది ఒకటి. ఏడాది ప్రాతిపదికన 6.2 శాతం, త్రైమాసికం ప్రాతిపదికన 13.5 శాతం పెరిగి రూ.4,350 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

అవెన్యూ సూపర్‌మార్ట్స్: డిసెంబర్‌ త్రైమాసికంలో, రిటైల్ చైన్ DMart ఏకీకృత నికర లాభం 17 శాతం పెరిగి రూ.690.41 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం 17.31 శాతం పెరిగి రూ.13,572.47 కోట్లకు చేరుకుంది.

షీలా ఫోమ్: కుర్లాన్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ క్యాపిటల్‌లో 2.57 శాతాన్ని దాదాపు రూ.55.33 కోట్లతో కొనుగోలు చేసే ప్రక్రియను ఈ కంపెనీ పూర్తి చేసింది. షీలా ఫోమ్ లిమిటెడ్‌కు ఇప్పుడు కుర్లాన్‌లో 97.23 శాతం వాటా ఉంది.

భెల్: తలబిరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (NTTPP) కోసం, NLC ఇండియా లిమిటెడ్ నుంచి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (భెల్) లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది. ఆర్డర్ సైజ్‌ రూ. 15,000 కోట్లకు పైగా ఉంది.

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: ‘చింగ్స్ సీక్రెట్’, ‘స్మిత్ & జోన్స్’ బ్రాండ్స్‌తో బిజినెస్‌ చేసే క్యాపిటల్ ఫుడ్స్ నుంచి 100 శాతం ఈక్విటీ షేర్లను దశలవారీగా కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈక్విటీలో 75 శాతం వాటాను వెంటనే కొని, మిగిలిన 25 శాతం వాటాను వచ్చే మూడేళ్లలో కొనుగోలు చేస్తుంది. 

జస్ట్ డయల్: Q3FY24లో రూ.75.3 కోట్ల నికర లాభం రూ.92 కోట్లకు చేరుకుంది, గత సంవత్సరం ఇదే కాలం కంటే 22.3 శాతం పెరిగింది.

అవలాన్ టెక్నాలజీస్: C-DAC (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్) కోసం వ్యూహాత్మక తయారీ భాగస్వామిగా ఈ కంపెనీ అవతరించింది. C-DAC, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ప్రధాన R&D సంస్థ.

గుడ్‌లక్ ఇండియా: సంస్థాగత ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ. 200 కోట్ల వరకు సమీకరించే పనిని గుడ్‌లక్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నాలుగు రోజుల్లో రూ.6.88 లక్షల కోట్లు, స్టాక్‌ మార్కెట్‌ చాలా ఇచ్చిందిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *