PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Alok, Asian Paints, HDFC Bank, LTTS

[ad_1]

Stock Market Today, 17 January 2024: గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలోని బలహీనత ఈ రోజు (బుధవారం, 15 జనవరి 2024) కూడా కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ఇండియన్‌ మార్కెట్లకు రెడ్‌ సిగ్నల్స్‌ అందుతున్నాయి. హెవీ వెయిట్‌ HDFC బ్యాంక్‌ ఫలితాలు, ఈ రోజు మార్కెట్‌ కదలికలో కీలక పాత్ర పోషించవచ్చు.

గ్లోబల్ మార్కెట్లు
అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించడంలో ఆచితూచి అడుగులు వేయాలని US ఫెడ్‌ గవర్నర్ క్రిస్టోఫర్ వాలెర్ మంగళవారం సూచించారు. వాల్ స్ట్రీట్ ఊహించిన దాని కంటే తక్కువ రేట్‌ కట్స్‌ ఉండొచ్చని సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో USలో 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ 4 శాతానికి పైగా ఉంది.

నిన్న, USలో S&P 500 0.37 శాతం, డౌ జోన్స్‌ 0.62 శాతం, నాస్‌డాక్ 0.19 శాతం పడిపోయాయి.

ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే.., చైనా Q4 GDP, రిటైల్ అమ్మకాలు, పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదార్లు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. హాంగ్ సెంగ్  1.3 శాతం లోయర్‌ సైడ్‌లో ఉంది. కోస్పి 1.2 శాతం, ASX 200 0.2 శాతం క్షీణించగా, జపాన్‌ నికాయ్‌ 1.2 శాతం జంప్‌తో తన ర్యాలీని తిరిగి ప్రారంభించింది.
 
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.06% రెడ్‌ కలర్‌లో 21,823 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-డౌన్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అలోక్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, హ్యాపీయెస్ట్ మైండ్స్, హిందుస్థాన్ మీడియా వెంచర్స్, ICICI ప్రుడెన్షియల్‌ లైఫ్ ఇన్సూరెన్స్, IIFL ఫైనాన్స్, LTIMindtree, మోస్చిప్ టెక్నాలజీస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్, క్వెస్ట్ క్యాపిటల్ మార్కెట్స్, రోజ్‌లాబ్స్ ఫైనాన్స్, సోమ్ డిస్టిలరీస్ అండ్‌ బ్రూవరీస్, స్పెషాలిటీ రెస్టారెంట్స్‌, స్టీల్ స్ట్రిప్స్ వీల్స్, స్టార్ హౌసింగ్ ఫైనాన్స్, టెక్ఇండియా నిర్మాణ్. వీటిపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.

HDFC బ్యాంక్: Q3FY24లో, దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌ స్టాండలోన్‌ నెట్‌ ప్రాఫిట్‌ 34 శాతం వృద్ధితో రూ. 16,373 కోట్లకు చేరుకుంది, అంచనాల కంటే ఇది 1 శాతం ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం (NII) YoYలో 24 శాతం జంప్‌తో రూ. 28,471.34 కోట్లకు చేరుకుంది, ఇది అంచనాల కంటే తగ్గింది.

ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్: ప్రీమియంలు, పెట్టుబడి ఆదాయంలో వృద్ధి కారణంగా మూడో త్రైమాసికంలో లాభం రూ. 431 కోట్లకు 22 శాతం YoY పెరిగిందని ఈ బీమా కంపెనీ ప్రకటించింది. త్రైమాసికంలో ఆర్జించిన నికర ప్రీమియం దాదాపు 14 శాతం పెరిగి రూ.4,305 కోట్లకు చేరుకుంది.

LTTS: L&T టెక్నాలజీ సర్వీసెస్ ఏకీకృత నికర లాభం రూ. 297 కోట్ల నుంచి YoYలో రూ. 336 కోట్లకు పెరిగింది, విశ్లేషకుల అంచనా రూ. 331 కోట్లను దాటింది. కార్యకలాపాల ఆదాయం 12 శాతం పెరిగి రూ.2,422 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయ వృద్ధి అంచనాను 17.5 – 18.5 శాతాన్ని కంటిన్యూ చేసింది. 

భారత్ పెట్రోలియం: కంపెనీ పరోక్ష స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ BISPL, జనవరి 18, 2027 మెచ్యూరిటీ తేదీతో, 4.375% రేట్‌తో, దాదాపు 120 మిలియన్‌ డాలర్ల విలువైన సీనియర్ నోట్ల కోసం టెండర్ ఆఫర్ ప్రకటించింది.

గోద్రెజ్ ప్రాపర్టీస్: కంపెనీ బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో మరో ఎకరం భూమిని అదనంగా కొనుగోలు చేసింది. దీంతో, ఆ ల్యాండ్‌ పార్శిల్‌లో సుమారు 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయవచ్చు. 

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: అదానీ గ్రూప్ సంస్థ Q3 అమ్మకాల్లో 15 శాతం YoY వృద్ధిని నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో 5.60 శాతంగా ఉన్న పంపిణీ నష్టం, ఈసారి 5.46 శాతానికి చేరుకుంది. 

GR ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్: ఈ కంపెనీ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ GR కాస్‌గంజ్ బైపాస్ ప్రైవేట్ లిమిటెడ్, రూ. 1,085.5 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాయితీ ఒప్పందం పూర్తి చేసింది.

TV18 బ్రాడ్‌కాస్ట్: Q3FY24కి రూ. 55.83 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ఈ మీడియా సంస్థ నివేదించింది. స్పోర్ట్స్‌ & డిజిటల్ విభాగాల్లో పెట్టుబడులు దీనికి కారణం. ఏకీకృత ఆదాయం 5% YoY తగ్గి రూ. 1,676.19 కోట్లకు పరిమితమైంది.

DCB బ్యాంక్: ఏప్రిల్ 29, 2024 నుంచి మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్ MD & CEO గా ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: గౌతమ్‌ అదానీ పేవరేట్‌ క్రికెటర్‌ అతనే, ఆ ప్రతిభకు ఫిదా

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *