PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Reliance, Coal India, BHEL, Shriram

[ad_1]

Stock Market Today, 29 February 2024: బుధవార నాటి భారీ విక్రయాలునే ఈ రోజు (గురువారం) కూడా దలాల్ స్ట్రీట్‌ మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు ప్రకటించబోయే Q3FY24 GDP గణాంకాలు, మంత్లీ F&O ఎక్స్‌పైరీ కావడంతో మార్కెట్‌లో కాస్త ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తోంది. బుధవారం వరకు కూడా, ఈ నెలలో నిఫ్టీ 1 శాతం పైగా లాభంలోనే ఉంది.

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 16.50 పాయింట్లు లేదా 0.08 శాతం రెడ్‌ కలర్‌లో 21,916 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.4 శాతం పచ్చగా ఉంది. ఇది మినహా మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి. కోస్పి 0.7 శాతం, నికాయ్‌ 0.5 శాతం, తైవాన్ 0.2 శాతం క్షీణించాయి.

నిన్న, ద్రవ్యోల్బణం డేటాకు ఒకరోజు ముందు, US మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. డౌ జోన్స్‌, S&P 500 స్వల్పంగా నష్టాల్లో ఉండగా, నాస్‌డాక్ 0.6 శాతం తగ్గింది.

10 సంవత్సరాల US ట్రెజరీ బాండ్ ఈల్డ్‌ దాదాపు 4.29 శాతంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు $82 వద్ద కదులుతోంది. బిట్‌కాయిన్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది, 2021 నవంబర్ తర్వాత మొదటిసారిగా $60,000 మార్క్‌ను దాటింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

రిలయన్స్: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్ 18 మీడియా, వాల్ట్ డిస్నీ కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత్‌లో 8.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజాన్ని స్థాపించేందుకు జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తాయి.

బజాజ్ ఆటో: బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్‌కు ఈరోజు రికార్డు తేదీ.

శ్రీరామ్ ఫైనాన్స్, UPL: NBFC రంగంలోని శ్రీరామ్ ఫైనాన్స్, మార్చి 28 నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లోకి వస్తుంది. అగ్రోకెమికల్స్ కంపెనీ UPL స్థానాన్ని అది భర్తీ చేస్తుంది.

నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్‌లో అదానీ పవర్, IRFC, జియో ఫైనాన్షియల్, PFC, REC చేరతాయి. అదానీ విల్మార్, ముత్తూట్ ఫైనాన్స్, PI ఇండస్ట్రీస్, ప్రాక్టర్ & గాంబుల్ హైజీన్, శ్రీరామ్ ఫైనాన్స్ ప్లేస్‌ల్లోకి అవి చేరతాయి.

కోల్ ఇండియా, BHEL: బొగ్గు-రసాయన వ్యాపారంలో భాగంగా, అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఈ రెండు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ JVలో కోల్ ఇండియాకు 51 శాతం, బీహెచ్‌ఈఎల్‌కు 49 శాతం వాటా ఉంటాయి.

వీనస్ పైప్స్: స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్స్స్‌ (ఫిట్టింగ్స్ బిజినెస్‌) బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. ఈ సెగ్మెంట్‌లో.. రూ.175 కోట్ల కాపెక్స్‌తో, స్టెయిన్‌లెస్ & టైటానియం వెల్డెడ్ ట్యూబ్స్‌ ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేస్తుంది.

ICICI సెక్యూరిటీస్: మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాల పుస్తకాలు, రికార్డులు తనిఖీ తర్వాతా, సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్‌ జారీ చేసింది.

గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్: ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ గ్రీన్‌ప్లైకి ‘వెల్‌-నోన్‌ ట్రేడ్‌మార్క్’ హోదా దక్కింది. ప్రభుత్వ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఈ గుర్తింపును ఇచ్చింది.

ఆయిల్ ఇండియా: FY24 కోసం రెండో మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించడానికి ఈ కంపెనీ బోర్డు వచ్చే నెల 8న సమావేశమవుతుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *