PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఊహించనట్టే ఆర్బీఐ సమీక్ష! 66,000 దాటేందుకు సెన్సెక్స్‌ రెడీ

[ad_1]

Stock Market Opening 06 October 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. క్రూడాయిల్‌ ధరల తగ్గుదల మార్కెట్లో ఉత్సాహం నింపింది. అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ విధాన సమీక్ష ఉండటంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 106 పాయింట్లు పెరిగి 19,652 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 352 పాయింట్లు ఎగిసి 65,983 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,631 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,867 వద్ద మొదలైంది. 65,762 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,030 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 352 పాయింట్లు పెరిగి 65,983 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం  19,545 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,621 వద్ద ఓపెనైంది. 19,589 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,658 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 106 పాయింట్లు పెరిగి 19,652 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 44,395 వద్ద మొదలైంది. 44,242 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,500 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 248 పాయింట్ల లాభంతో 44,462 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, టాటా కన్జూమర్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.57,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.22,920 వద్ద కొనసాగుతోంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగింది. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్‌, వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటు పెంచాయి. వీటికి తోడు ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు విలవిల్లాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 92 పాయింట్లు తగ్గి 19,436 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *