PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఎక్కువ ఆదాయం ఇచ్చే ఎస్‌బీఐ పథకం, ఆదివారంతో క్లోజ్‌, త్వరపడండి

[ad_1]

SBI Amrit Kalash Scheme Details: పెద్దగా రిస్క్‌ లేకుండా, కచ్చితమైన ఆదాయం సంపాదించగలిగే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. ఇది, మన దేశంలో అమిత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. 

దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గత కొన్నేళ్లుగా ఒక స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని అమలు చేస్తోంది, ఆ స్కీమ్‌ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని గ్యారెంటీగా ఇస్తోంది. స్కీమ్‌ పేరు.. ‘ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌’. ఈ పథకం గడువును బ్యాంక్‌ ఇప్పటికే చాలాసార్లు పెంచింది. 

ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం చివరి ఘట్టాన్ని చేరింది. ఇప్పుడు, ఈ నెలాఖరు (2024 మార్చి 31) వరకే ఛాన్స్‌ ఉంది. అంటే, మంచి వడ్డీ ఆదాయం సంపాదించుకునేందుకు ఆదివారం వరకే టైమ్‌ ఉంది. తక్కువ కాలంలో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని ప్లాన్‌ చేస్తున్న వాళ్లకు ఇది అనువైన ఎంపిక.

ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ వివరాలు:

వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate)
SBI అమృత్‌ కలశ్‌ పథకం టెన్యూర్‌ 400 రోజులు. ఈ టర్మ్‌ ప్లాన్‌లో డబ్బు (రూ. 2 కోట్ల లోపు) డిపాజిట్‌ చేసే సాధారణ పౌరులకు ఏడాదికి 7.10% వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తుంది. ఇదే గడువులో సీనియర్‌ సిటిజన్లకు మరో అర శాతం (0.50%) కలిపి ఏటా 7.60% వడ్డీ ఆదాయాన్ని జమ చేస్తుంది. 

SBI అమృత్ కలశ్‌ డిపాజిట్ స్కీమ్‌పై వచ్చే వడ్డీ విషయంలో.. నెలనెలా, 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం), 6 నెలలకు ఒకసారి (ఆర్ధ వార్షికం) వంటి ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి FD ఖాతాలో వడ్డీ డబ్బు జమ అవుతుంది. 

ఎవరు అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు? ‍‌(SBI Amrit Kalash Deposit Scheme Eligibility)
రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. అంటే, రూ.2 కోట్ల లోపు మొత్తంతో ఎఫ్‌డీ వేయాలనుకున్న అందరూ దీనికి అర్హులే. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్‌ ఓపెన్‌ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్‌ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? ‍‌(How to apply for Amrit Kalash Online?)
ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ కోసం ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ అంటే.. మీకు దగ్గరలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ శాఖకు వెళ్లి అకౌంట్ ఓపెన్‌ చేయవచ్చు. అక్కడి వరకు వెళ్లే పరిస్థితి లేకపోతే, ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేస్తుకోవచ్చు. దీనికోసం మీకు SBI ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యోనో (SBI YONO) ఉంటే చాలు. మీరు ఇంట్లోనే కూర్చుని, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌/యోనో ద్వారా ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

మార్చి 31తో ఆర్థిక సంవత్సరాంతం కాబట్టి, శని & ఆదివారాల్లో SBI పని చేస్తుంది. మీ దగ్గరలోని బ్రాంచ్‌కు వెళ్లి ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ కింద అకౌంట్‌ ప్రారంభించవచ్చు.

ఒకవేళ మీకు అర్జంటుగా డబ్బు అవసరమైనా/ ఎఫ్‌డీని కొనసాగించలేకపోయినా, ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే (Amrit Kalash premature withdrawal) ఆప్షన్‌ కూడా ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ మీద బ్యాంక్‌ లోన్‌ (loan against Amrit Kalash) కూడా వస్తుంది.

ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) నిబంధనల ప్రకారం, అమృత్‌ కలశ్‌ పథకంలో మీరు తీసుకునే వడ్డీపై TDS కట్‌ అవుతుంది. ఇలా కట్‌ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే (ITR Filing) సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ, టాక్స్‌ ఆఫీస్‌లు శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయి, కారణం ఇదే

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *