PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఏప్రిల్‌లో పెద్ద పండుగలు, నెలలో సగం రోజులు బ్యాంక్‌లు బంద్‌

[ad_1]

Bank Holidays List For April 2024: కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభానికి గుర్తుగా, వచ్చే నెలలో (ఏప్రిల్‌) దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుస సెలవుల కోసం సిద్ధమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం, ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్‌ నెలలో 14 రోజుల పాటు మూతబడతాయి. 

ఏప్రిల్‌ నెల మొదటి రోజు నుంచే బ్యాంక్‌ల సెలవులు ప్రారంభం అవుతాయి. ఆ నెలలో ఉగాది (Ugadi 2024), గుఢి పడ్వా, ఈద్-ఉల్-ఫితర్ (Ramadan 2024), బోహాగ్ బిహు, శ్రీరామ నవమి ‍‌(Rama Navami 2024), బైశాకి వంటి పండగలు, వివిధ సందర్భాల కారణంగా బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్‌ నెలలోని 4 ఆదివారాలు, రెండో & నాలుగో శనివారాలు కూడా బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం సెలవుల సంఖ్య ఒకే విధంగా ఉన్నప్పటికీ, రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి సెలవు రోజు మారవచ్చు. 

వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగా సేవ్‌ చేసుకోండి. సెలవు రోజులను గుర్తు పెట్టుకుంటే, ఆ రోజుల్లో బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.

2024 ఏప్రిల్‌లో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in April 2024): 

– ఏప్రిల్ 01 (సోమవారం): వార్షిక ఖాతాల ముగింపు కోసం బ్యాంకులను మూసివేస్తారు, లావాదేవీలు జరగవు. 
– ఏప్రిల్ 05 ‍‌(శుక్రవారం): బాబు జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్-ఉల్-విదా
– ఏప్రిల్ 07‍: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
– ఏప్రిల్ 09 ‍‌(మంగళవారం): గుఢి పడ్వా, ఉగాది, సాజిబు నొంగ్మపన్బా (చెయిరాబా), 1వ నవరాత్రి
– ఏప్రిల్ 10 ‍‌(బుధవారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)
– ఏప్రిల్ 11 ‍‌(గురువారం): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) (1వ షావాల్)
– ఏప్రిల్ 13‍: బోహాగ్ బిహు, చీరోబా, బైశాఖి, బిజు పండుగ + రెండో శనివారం
– ఏప్రిల్ 14: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
– ఏప్రిల్ 15 ‍‌(సోమవారం): బోహాగ్ బిహు, హిమాచల్ డే
– ఏప్రిల్ 17 (బుధవారం): శ్రీరామ నవమి
– ఏప్రిల్ 20 (శనివారం): గరియా పూజ
– ఏప్రిల్ 21: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
– ఏప్రిల్ 27: నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
– ఏప్రిల్ 28: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

సెలవు రోజుల్లోనూ మీ పని ఆగదు
ప్రస్తుతం, బ్యాంకింగ్‌ టెక్నాలజీ చాలా పెరిగింది. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంక్‌ హాలిడేస్‌ మీ పనులపై పెద్దగా ప్రభావం చూపవు. ఈ డిజిటల్‌ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది. 

భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: భారీ షాక్‌ ఇచ్చిన స్వర్ణం – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *