PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్న క్రెడిట్‌ కార్డ్‌లు, భలే ఛాన్స్‌!

[ad_1]

Credit Cards With Attractive Cashback Offer: ఒకప్పుడు, క్రెడిట్‌ కార్డ్‌ల కోసం జనం వెంపర్లాడితే… ఇప్పుడు బ్యాంక్‌లు వెంటపడుతున్నాయి. క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఫీచర్లను ఎరగా వేస్తున్నాయి. అలాంటి ఎరల్లో ఒకటి ‘క్యాష్‌ బ్యాక్ ప్రోగ్రామ్‌’. 

క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌తో ఉన్న క్రెడిట్‌ కార్డ్‌లు యూజర్లను బాగానే మెప్పిస్తున్నాయి. ఈ తరహా కార్డ్‌లపై వచ్చే క్యాష్‌ బ్యాక్.. ఖాతాదారుడి క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లో జమ అవుతుంది. క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు నుంచి ఆ మొత్తాన్ని తగ్గించి బిల్‌ కట్టొచ్చు. 

క్యాష్‌ బ్యాక్‌ అందించే 5 క్రెడిట్‌ కార్డ్‌లు ‍‌(5 Credit cards offering attractive cashback)

5 క్రెడిట్‌ కార్డ్‌లు మంచి క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నాయి. వీటిలో ఏ కార్డ్‌ ద్వారానైనా ఒక వ్యక్తి ఒక నెలలో రూ.లక్ష రూపాయలు ఖర్చు పెడితే.. అతనికి ఒక సంవత్సరంలో ఎంత డబ్బు క్యాష్‌ బ్యాక్‌ రూపంలో తిరిగి వస్తుందన్న లెక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి.

క్యాష్‌ బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (Cashback SBI Credit Card)
క్యాష్‌ బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే.. ఈ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసే ఖర్చుపై 5% డబ్బు తిరిగొస్తుంది. ఆఫ్‌లైన్ ద్వారా చేసే ఖర్చుపై 1% క్యాష్‌ బ్యాక్ వస్తుంది. ఉదాహరణకు… ఒక వ్యక్తి ఒక నెలలో రూ.లక్ష రూపాయలను ఈ కార్డ్‌ ద్వారా ఖర్చు చేశాడనుకుందాం. అందులో, రూ. 20,000 మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ఖర్చు చేసి, మిగిలిన రూ. 80,000 మొత్తాన్ని ఆఫ్‌లైన్‌లో ఖర్చు చేస్తే… అతనికి ఏడాదిలో వచ్చే మొత్తం క్యాష్‌బ్యాక్ రూ. 21,600 అవుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డ్ (HDFC Millenia Credit Card)
ఈ కార్డ్ ద్వారా… అమెజాన్‌, బుక్‌ మై షో, కల్ట్‌.ఫిట్‌, ఫ్లిప్‌కార్డ్‌, మింత్ర, సోనీ లివ్‌, స్విగ్గీ, టాటా క్లిక్‌, ఉబర్‌, జొమాటో ఫ్లాట్‌ఫామ్స్‌లో చేసే స్పెండింగ్‌ మీద 5% క్యాష్‌ తిరిగొస్తుంది. ఇతర ఖర్చులపై 1% క్యాష్‌ బ్యాక్‌ అందుతుంది. క్యాష్‌ బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తరహాలోనే, ఈ కార్డ్‌ ద్వారా ఒక నెలలో రూ. 20,000 మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ఖర్చు చేసి, మరో రూ. 80,000 మొత్తాన్ని ఆఫ్‌లైన్‌లో ఖర్చు చేస్తే… ఏడాదిలో వచ్చే క్యాష్‌బ్యాక్ రూ. 21,600 అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Ace Credit Card)
ఈ కార్డ్‌ ద్వారా… బిల్లు చెల్లింపులపై 5% క్యాష్‌ బ్యాక్, స్విగ్గీ, జొమాటో, ఓలా ఫ్లాట్‌ఫామ్స్‌లో చేసే ఖర్చులపై 4% క్యాష్‌ బ్యాక్, ఇతర అన్ని స్పెండింగ్స్‌ మీద 2% క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది. ప్రతి నెలా.. బిల్ పేమెంట్లు & 4% క్యాష్‌బ్యాక్‌ వచ్చే కేటగిరీలపై రూ. 10,000 ఖర్చు చేసి; మరో రూ. 90,000 ఇతర విషయాల కోసం స్పెండ్‌ చేస్తే, ఆ వ్యక్తికి ఆ సంవత్సరంలో రూ. 20,400 డబ్బు తిరిగి వస్తుంది.

ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ (ICICI Amazon Pay Credit Card)
ఈ కార్డ్‌ ద్వారా, అమెజాన్‌ ప్రైమ్ మెంబర్లు అమెజాన్‌లో ఏదైనా వస్తువు కొంటే 5% క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. ‘అమెజాన్‌ పే’ చెల్లింపులపై 2% క్యాష్‌ బ్యాక్, ఇతర వ్యయాలపై 1% క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. ఉదాహరణకు… ఒక వ్యక్తి అమెజాన్‌లో రూ.10,000, అమెజాన్‌ పే ద్వారా రూ. 20,000, ఇతర అవసరాల కోసం రూ. 70,000 ఖర్చు చేస్తే.. అతనికి సంవత్సరానికి రూ. 19,200 క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది.

స్టాండర్డ్‌ చార్టర్డ్ స్మార్ట్ క్రెడిట్ కార్డ్ (Standard Chartered Smart Credit Card)
స్టాండర్డ్‌ చార్టర్డ్ స్మార్ట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసే వ్యయంపై 2%, ఆఫ్‌లైన్‌లో చేసే ఖర్చులపై 1% క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. ఒక వ్యక్తి ప్రతి నెలా ఆన్‌లైన్‌ మోడ్‌లో రూ. 50,000, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో రూ. 50,000 ఖర్చు చేస్తే, ఒక ఏడాదిలో రూ. 18,000 క్యాష్‌ బ్యాక్‌ రూపంలో అతనికి తిరిగి వస్తుంది.

మరో ఆసక్తికర కథనం: క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు కట్టలేకపోతున్నారా? బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ ఉందిగా!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *