PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

జవనరి నుంచి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ కొత్త రూల్స్‌ – ఓచర్లు & రివార్డ్‌ పాయింట్లలో మార్పులు

[ad_1]

SBI Credit Card New Rules: మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank Of India -SBI) అతి పెద్దది. ప్రతి రోజు కోట్ల మంది ఖాతాదారులు బ్యాంక్‌ సేవలను ఉపయోగించుకుంటుంటారు. వారీలో స్టేట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లు కూడా ఉంటారు. ఈ ఏడాది జూన్‌ నాటికి మన దేశంలో 14 మిలియన్ల ( ఒక కోటి 40 లక్షలు) SBI క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ అయ్యాయి. ఈ కార్డుల ద్వారా వివిధ రకాల వరల్డ్‌ క్లాస్‌, వాల్యూ యాడెడ్‌ పేమెంట్‌ ప్రొడక్ట్స్‌, సర్వీసులను కస్టమర్లు అందుకుంటున్నారు. 

వివిధ రకాల ప్రొడక్ట్స్‌ & సర్వీసులు అందిస్తున్నందుకు, కస్టమర్ల నుంచి రకరకాల రూపాల్లో రుసుములను ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card – ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థ ఇది) వసూలు చేస్తుంటుంది.

2023 జనవరి నుంచి కొత్త రూల్స్‌
SBI క్రెడిట్ కార్డ్ నియమాలు 2023 జనవరి 1వ తేదీ నుంచి మారుతున్నాయి. కొంతమంది కార్డ్ హోల్డర్లకు ఈ నియమాలు వర్తిస్తాయి. ముందుగా, SimplyCLICK కార్డ్ హోల్డర్‌ల కోసం నిర్దిష్ట నియమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్‌ & పేమెంట్‌ సర్వీసెస్‌ (State Bank of India Cards and Payment Services) అప్‌డేట్ చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ వెబ్‌సైట్ ప్రకారం… ఓచర్‌లు, రివార్డ్ పాయింట్‌ల రిడెంప్షన్‌కు సంబంధించి రెండు నియమాలు కొత్త సంవత్సరం (2023) నుంచి మారతాయి.

News Reels

“2023 జనవరి 6వ తేదీ నుంచి, SimplyCLICK కార్డ్ హోల్డర్‌లకు జారీ చేసిన క్లియర్‌ ట్రిప్‌ (Cleartrip) ఓచర్‌ను ఒకే లావాదేవీలో మాత్రమే రీడీమ్ చేయాలి. మరే ఇతర ఆఫర్ లేదా ఓచర్‌తో కలిపి ఉపయోగించకూడదు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు” అని SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ తెలిపింది. 

ఇది కాకుండా, SimplyCLICK లేదా SimplyCLICK Advantage ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా Amazon. inలో చేసే ఆన్‌లైన్ వ్యయం మీద రివార్డ్ పాయింట్‌లకు సంబంధించిన నియమాలు కూడా 2023 జనవరి 1 నుంచి మారుతాయి.

“SimplyCLICK లేదా SimplyCLICK Advantage ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా Amazon. inలో చేసే ఆన్‌లైన్ వ్యయం మీద అందించే 10X రివార్డ్ పాయింట్లను 2023 జనవరి 1వ తేదీ నుంచి 5X రివార్డ్ పాయింట్లకు సవరించడం జరుగుతుంది. SimplyCLICK లేదా SimplyCLICK Advantage ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా అపోలో 24X7, బుక్‌ మై షో, క్లియర్‌ ట్రిప్‌, ఈజీ డైనర్‌, లెన్స్‌కార్ట్‌, నెట్‌మెడ్స్‌ వెబ్‌సైట్లలో చేసే ఆన్‌లైన్‌ వ్యయం మీద 10X రివార్డ్ పాయింట్ల జమ కొనసాగుతుంది.” అని SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇప్పటికే ఛార్జీల మోత
ఇప్పటికే… కొన్ని ఛార్జీల విషయంలో SBI Card మార్పులు చేసింది. EMI లావాదేవీల మీద ఛార్జీలు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపుల మీద కొత్త ఛార్జీలను పెంచింది. 2022 నవంబర్ 15వ తేదీ నుంచి ఇవి అమల్లోకి కూడా వచ్చాయి.

EMI లావాదేవీల మీద ప్రాసెసింగ్ ఫీజును “రూ. 99 + వర్తించే పన్నులు” నుంచి “రూ. 199 + వర్తించే పన్నులు”కు పెంచింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపు లావాదేవీల మీద గతంలో లేని ప్రాసెసింగ్ ఫీజును 2022 నవంబర్ 15వ తేదీ నుంచి వసూలు చేస్తోంది. “రూ. 99 + వర్తించే పన్నులు”ను ప్రాసెసింగ్‌ ఫీజుగా తీసుకుంటోంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *