[ad_1]
Hyundai Tucson Facelift: హ్యుందాయ్ తన ప్రీమియం ఎస్‌యూవీ 2024 టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను అప్‌డేటెడ్ డిజైన్‌తో పరిచయం చేసింది. ప్రస్తుత టక్సన్ భారతీయ మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, దాని కొత్త అప్‌డేటెడ్ తాజా మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలోకి రానుంది. అప్‌డేట్ చేసిన ఇంటీరియర్‌తో పాటు ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు కాకుండా డిజైన్ పరంగా పెద్ద అప్‌డేట్‌లు ఏమీ లేవు.
ముందు భాగంలో పారామెట్రిక్ గ్రిల్‌ను రివైజ్ చేశారు. బంపర్‌కు మరింత మస్కులర్ లుక్ వచ్చింది. అలాగే మందపాటి స్కిడ్ ప్లేట్‌ను కూడా ఈ కారు పొందింది. దీని బంపర్ లుక్ కూడా మరింత యాంగులర్‌గా ఉంటుంది. అంచులు కూడా చాలా క్లీన్‌గా ఉంటాయి. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, మందమైన క్లాడింగ్‌తో కారు పక్కభాగంలో కూడా అప్‌డేట్ చేశారు.
ఇంటీరియర్, ఫీచర్లు
హ్యుందాయ్ పెద్ద గ్లోబల్ మోడల్ ఎస్‌యూవీని పోలి ఉండే కర్వ్డ్ ట్విన్ స్క్రీన్ డిస్‌ప్లేతో దీని ఇంటీరియర్‌లో మార్పులు చేశారు. జెనెసిస్‌ను పోలి ఉండే కొత్త లుక్ స్టీరింగ్ వీల్, కొత్త బటన్ డిజైన్‌తో కొత్త లుక్ సెంటర్ కన్సోల్ లేఅవుట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది హాప్టిక్ కంట్రోల్స్‌ను కూడా కలిగి ఉంది. అయితే వాతావరణ నియంత్రణ కోసం ఫిజికల్ బటన్లు అందించారు. ఫుల్లీ వైడ్ ఎయిర్‌కాన్ వెంట్‌లు కూడా మార్చారు. మొత్తం క్యాబిన్ ఇప్పుడు మరింత ప్రీమియం లుక్‌తో యూజర్ ఫ్రెండ్లీగా ఉంది.
ఇంజిన్‌లో ఏం మార్పులు చేశారు?
దీని పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులూ ఆశించక్కర్లేదు. ఇది 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో 2.0 లీటర్ పెట్రోల్‌ను కలిగి ఉన్న ఏకైక హ్యుందాయ్ కారు ఇదే. అల్కజార్, వెర్నాలో కూడా 1.5 లీటర్ టర్బో పెట్రోల్‌ను అందిస్తున్నారు. ఈ చిన్న అప్‌డేట్‌లతో పాటు కొత్త టక్సన్… హ్యుందాయ్ డిజైన్ ఎలిమెంట్స్‌తో రానుంది. భారతదేశంలో టక్సన్ గత సంవత్సరం నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది ఇతర ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.
హ్యుందాయ్ టక్సన్ ఇంతకు ముందు వెర్షన్ అంతర్జాతీయ మార్కెట్లో 2020 సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. టక్సన్ ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ తరఫున బెస్ట్ సెల్లర్ కారుగా నిలిచింది. అయితే మనదేశంలో మాత్రం టక్సన్ ఊహించినంత సక్సెస్ కాలేదు. హ్యుందాయ్ క్రెటా కంటే టాప్ వెర్షన్‌గా ప్రీమియం ఫీచర్ల ఈ కారు లాంచ్ అయింది. హ్యుండాయ్ టక్సన్ లుక్స్ విషయంలో ఎంతో అటెన్షన్ పొందింది. దీని ఫ్రంట్ గ్రిల్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో డీఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. గ్రిల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఎస్‌యూవీ వెనకవైపు నుంచి చాలా అద్భుతంగా ఉంది. ఈ కారులో 4 స్పోక్ స్టీరింగ్ వీల్, హుడ్‌లెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, బోస్ సౌండ్ సిస్టం, వాయిస్ అసిస్టెంట్, ఎలక్ట్రానికల్లీ ఫోల్డబుల్ సెకండ్ రో సీట్లు, డ్యూయల్ వర్టికల్లీ స్టాక్డ్ టచ్‌స్క్రీన్లు సెంట్రల్ కన్సోల్‌లో అందించారు.
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ – సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో – ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
[ad_2]
Source link