PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

టాక్స్‌ ఆదా చేసే ఎఫ్‌డీలు ఇవి, వడ్డీ కూడా భారీగానే సంపాదించొచ్చు!

[ad_1]

Income Tax Return Filing 2024 – Tax Saving FDs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) ప్రి-క్లైమాక్స్‌ దశలో ఉన్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR 2024) ఫైల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న టాక్స్‌పేయర్లు, పన్ను ఆదా చేసే మార్గాల కోసం వెదుకుతున్నారు.

పన్ను భారం పడకుండా ఆదాయం సంపాదించే మంచి మార్గాల్లో ‘టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌’ ‍‌(Tax Saving Fixed Deposits) ఒక మంచి ఆప్షన్‌. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే, ఇన్వెస్టర్లకు పన్ను ఆదా కావడం మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం, పెట్టుబడులకు రక్షణ లభిస్తాయి. ఈ FD పథకాలపై, వివిధ బ్యాంక్‌లు మంచి వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి.

ఎంత పన్ను ఆదా చేయవచ్చు?
“టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌”లో పెట్టుబడి పెట్టే డబ్బుకు, ITR ఫైలింగ్‌ సమయంలో, సెక్షన్ 80C (Section 80C of the Income Tax Act) కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్‌లో జమ చేసే డబ్బుపై, ఒక ఆర్థిక సంవత్సరంలో, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ సెక్షన్‌ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఇది వర్తించదు.

ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్‌ ఉంటుంది. ఈ గడవుకు ముందే వెనక్కు తీసుకోవడానికి వీలుండదు. ఈ తరహా డిపాజిట్ల మీద బ్యాంక్‌ లోన్ (Bank Loan on Tax Saving Fixed Deposits) తీసుకోవడానికి కూడా వీలుండదు. సెక్షన్ 80TTB కింద, సీనియర్ సిటిజన్లకు, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ వడ్డీపై రూ.50,000 వరకు పన్ను రాయితీ లభిస్తుంది.

‘పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల’ను ఆఫర్‌ చేస్తున్న బ్యాంక్‌లు (Banks offering ‘Tax Saving Fixed Deposit Schemes’)

డీసీబీ బ్యాంక్ టాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ ‍‌(DCB Bank tax-saving FD): ఆదాయ పన్నును ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఈ బ్యాంక్‌ 7.4% వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ టాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ (IndusInd Bank tax-saving FD): టాక్స్‌ సేవ్‌ చేసే ఎఫ్‌డీలపై ఈ బ్యాంక్‌ 7.25% వడ్డీ ఆదాయాన్ని అందిస్తుంది.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్ టాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ (RBL Bank tax-saving FD): పన్ను మినహాయింపు కల్పించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ బ్యాంక్‌ 7.1% వడ్డీ చెల్లిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) కూడా పన్ను ఆదా చేసే FDలపై 7% వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‍(SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (PNB) కూడా టాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేటు భారీగా పతనం – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *