PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

టీసీఎస్ షేర్లను అమ్మకానికి పెడుతున్న టాటా సన్స్, డీల్ విలువ రూ.9300 కోట్లు

[ad_1]

Tata Sons To Sell TCS Shares: దేశంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో తనకున్న షేర్లను విక్రయించాలని టాటా సన్స్ నిర్ణయించింది. బ్లాక్ డీల్ ‍‌(Block Deal) కింద 2.34 కోట్ల టీసీఎస్ షేర్లను ‍‌(TCS Shares Deal) దాదాపు రూ.9300 కోట్లకు విక్రయించాలని టాటా సన్స్ నిర్ణయించింది. ఈ లార్జ్‌ డీల్‌లో, టీసీఎస్‌ మాతృ సంస్థ టాటా సన్స్‌ ఒక్కో షేరును రూ. 4001 చొప్పున అమ్మాలని చూస్తోంది. సాఫ్ట్‌వేర్ ఎగుమతి కంపెనీ టీసీఎస్‌లో మాతృ సంస్థకు 72.38 శాతం వాటా ఉంది. 

ఆల్ టైమ్ హైని తాకిన టీసీఎస్
నిన్న (సోమవారం, 18 మార్చి 2024) టీసీఎస్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) ఆల్ టైమ్ హై రేటు రూ. 4254.45 కు చేరుకున్నాయి. అయితే, రోజు ముగిసే సమయానికి 1.72 శాతం క్షీణించి రూ. 4144.75 వద్ద ఆగాయి. సోమవారం నాటి ముగింపు రేటుతో పోలిస్తే, టాటా సన్స్ దాదాపు 3.6 శాతం డిస్కౌంట్‌కు ఈ లార్జ్‌ డీల్‌ చేయబోతోంది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 15 లక్షల కోట్లు. మన దేశంలో, మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మాత్రమే టీసీఎస్‌ కంటే ముందుంది.

గత ఏడాది కాలంలో టీసీఎస్ షేర్లు దాదాపు 32 శాతం పెరిగాయి. గత ఆరు నెలల కాలంలో దాదాపు 15 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 9 శాతం ఎగబాకాయి. ఈ నెలలో అన్ని టాటా గ్రూప్ స్టాక్స్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. 

లిస్టింగ్‌ నుంచి తప్పించుకునే ప్లాన్‌లో టాటా సన్స్
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనల ప్రకారం టాటా సన్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అవుతుంది. TCSలో బ్లాక్ డీల్ కారణంగా,  టాటా సన్స్‌ను లిస్టింగ్‌కు వెళ్లకుండా ఆపడానికి టాటా గ్రూప్‌నకు మార్గం సుగమం అవుతుంది. RBI రూల్స్‌ ప్రకారం, అన్ని పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs) స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ కావాలి. టాటా సన్స్ కూడా ఈ కోవలోకి వస్తుంది.

స్పార్క్ క్యాపిటల్ రిపోర్ట్‌ ప్రకారం, 2025 సెప్టెంబర్ నాటికి టాటా సన్స్ లిస్టింగ్ జరగాలి. RBI నోటిఫికేషన్ ప్రకారం, అప్పటికి టాటా సన్స్ అప్పర్‌ లేయర్ NBFCగా 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేస్తుంది. టాటా సన్స్ తన రుణాన్ని రీకన్‌స్ట్రక్ట్‌ చేస్తే లేదా టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో తన వాటాను ఇతర కంపెనీకి విక్రయిస్తే, అప్పర్‌ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ కింద కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ) హోదాను కోల్పోతుంది. ఫలితంగా లిస్టింగ్‌ రూల్స్‌ నుంచి తప్పించుకోగలుగుతుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: మనవడికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఖరీదైన గిఫ్ట్, విలువ ఎంతో తెలుసా!

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *