[ad_1]
తృణధాన్యాలు..
బార్లీ, గోధుమలు, ఓట్స్, మిల్లెట్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి మధుమేహం ఉన్నవారికి గుడ్ ఆప్షన్. అవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించేందుకు గొప్పవి.
Also Read : Weight loss : రెగ్యులర్‌గా ఈ రైస్ తింటే బరువు తగ్గుతారట..
పండ్లు..
అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు డయాబెటిక్ వారికి అలర్జీ లేనంత వరకు ఏదైనా పండ్లు తినొచ్చని సూచిస్తారు. అరటిపండ్లు, మామిడి, ద్రాక్ష వంటి అధిక కేలరీల పండ్లకు దూరంగా ఉండాలి. యాపిల్స్, నారింజ, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయలను తినడం వల్ల మీకు సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. అయితే, మీ పోర్షన్ బ్యాలెన్స్ చూసుకోండి.
Also Read : Relationship Tips : మా కజిన్ భార్య నన్ను అసహ్యించుకుంటోంది.. దీంతో కజిన్..
బీన్స్..
బీన్స్, శనగలు, కాయధాన్యాల వంటి ఇతర పప్పు ధాన్యాలలో ఎక్కువ మొత్తంలో పిండి పదార్థాలు ఉంటాయి. అయినప్పటికీ, అవి ఫైబర్, ప్రోటీన్‌కి అద్భుత మూలం. డయాబెటిక్ పేషెంట్స్ వాటిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. పోర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) ప్రకారం, మీకు డయాబెటిస్ ఉన్నట్లైతే కిడ్నీ బీన్స్, పింటో బీన్స్, నేవీ బీన్స్, బ్లాక్స్ వంటివాటిని మీ ఫుడ్‌లో చేర్చుకోవచ్చు.
కూరగాయలు..
కూరగాయల వంటి ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. అయినప్పటికీ, కొన్ని కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్స్ హెల్త్‌పై ప్రభావం చూపుతాయి. వీటిలో బంగాళాదుంపలు, బఠానీలు, బటర్ నాట్ స్క్వాష్, బఠానీలు ఉన్నాయి. కానీ, మీరు ఎప్పుడూ మీ ఆహారంలో చిలగడదుంపలు, బీట్‌రూట్, మొక్కజొన్న వంటి చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలు ఫైబర్, విటమిన్ ఎ కి మంచి మూలం. ఎప్పటికప్పుడు తినొచ్చు.
డెయిరీ ప్రొడక్ట్స్..
డయాబెటిస్ ఉన్నవారి షుగర్ ఫుడ్స్, డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. పాల వంటి డెయిరీ ప్రోడక్ట్స్, సహజ చక్కెర ఉన్నప్పటికీ, రోజువారీ ఆహారంలో చేర్చవచ్చు. ఎందుకంటే, డెయిరీ ఫుడ్స్‌లో ప్రోటీన్స్, కాల్షియం ఉంటాయి. కాబట్టి పాలు, జున్ను, పెరుగు వంటివి తక్కువగా తీసుకుంటే అవి ఆరోగ్యానికి చాలా మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply