PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

థైరాయిడ్‌ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరువు తగ్గాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!

[ad_1]

Thyroid Weight Loss Tips: ఒక దశాబ్దకాలంగా థైరాయిడ్‌ సమస్య ఎక్కువుతోంది. అంచనా ప్రకారం, భారతదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్‌ సమస్య ఎక్కువైంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. శరీర జీవక్రియల్ని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్‌. శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ.. ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు వచ్చి.. హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజంలో శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్.. పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం కారణంగా.. వేగంగా బరువు పెరుగుతారు. హైపోథైరాయిడిజం పేషెంట్స్‌ బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీ డైట్‌లో కొన్ని ఆహారం పదార్థాలు చేర్చుకుంటే.. బరువును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

నట్స్‌..

నట్స్‌..

NCBI నివేదిక ప్రకారం,నట్స్‌ బరువు తగ్గడానికి సహాయపడతాయి. నట్స్‌లో సెలీనియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. సెలీనియం.. థైరాయిడ్‌ గ్రంధి పనితీరుకు అవసరమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. ముఖ్యంగా బ్రెజిలియన్ బీటెల్‌ నట్‌లో సెలీనియం మెండుగా ఉంటుంది. రోజుకు మూడు బ్రెజిలియన్‌ బీటెల్‌ నట్ తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. బ్రెజిలియన్ బీటెల్‌ నట్‌లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్‌, గుమ్మడి గింజల్లోనూ జింక్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇవి థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపరుస్తుంది. (image source – pixabay)

బీన్స్‌, పప్పుధాన్యాలు

బీన్స్‌, పప్పుధాన్యాలు

బీన్స్‌, పప్పుధాన్యాలలో.. ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ గ్రంధి మెరుగైన పనితీరుకు సహాయపడతాయి. శరీరంలో జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇవి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మీ డైట్‌లో పెసరల్లు, శనగాలు, బీన్స్‌, చిక్కుళ్లు వంటి ఆహారం ఎక్కువగా చేర్చుకోండి. (image source – pixabay)

గుడ్లు..

గుడ్లు..

పబ్మెడ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మీరు హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే.. బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి గుడ్లు బెస్ట్‌ ఆప్షన్‌. గుడ్డు పచ్చసొనలో.. జింక్‌ సెలీనియం, ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ పనితీరును మెరుగుపరచడంతో పాటు.. బరువును నియంత్రణలో ఉంచుతాయి. (image source – pixabay)

ఆకుకూరలు, తాజా కూరగాయలు..

ఆకుకూరలు, తాజా కూరగాయలు..

ఆకుకూరలు, తాజా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతోపాటు, బరువు పెరగడం వంటి లక్షణాలను నియంత్రిస్తాయి. మీ డైట్‌లో టమాటా, క్యాప్సికమ్, ముల్లంగి, క్యాబేజీ, ఆకుకూరలు చేర్చుకుంటే.. బరువు కంట్రోల్‌లో ఉంటుంది. (image source – pixabay)

కొబ్బరి..

కొబ్బరి..

పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనె థైరాయిడ్ రోగులకు ఉత్తమ ఆహారం. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరాయిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. (image source – pixabay)

నీరు ఎక్కువగా తాగండి..

నీరు ఎక్కువగా తాగండి..

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, నీరు ఎక్కువగా తీసుకోండి. నీరు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరం నుంచి టాక్సిన్స్‌ తొలగుతాయి. నీరు ఎక్కువగా తాగితే మీ ఆకలి కూడా తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. (image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *