PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

పిస్తా పప్పులు తింటే గుండెకి మంచి జరుగుతుందా..


నట్స్ కొనాలనుకున్నప్పుడు మనం చాలా రకాలు ఆలోచిస్తాం. ఏది కొనాలి.. ఏది హెల్దీ అని. చాలా మంది బాదం పప్పులను ఎక్కువగా కొంటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి అని. అయితే, ఈ నట్స్‌లో మరో హెల్దీ నట్స్ కూడా ఉన్నాయండి. అవే పిస్తా పప్పులు. అవును.. ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్‌కి గొప్ప మూలమైన ఈ పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, ఈ పప్పుల చుట్టూ కొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటి.. అసలు నిజాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం.

​గుండెజబ్బులు దూరం..

యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి చాలా ముఖ్యం. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గించడంలో కీ రోల్ పోషిస్తాయి. అంతేకాదు.. ఇందులోని పాలీఫెనాల్స్, టోకోఫెరోల్స్ గుండెజబ్బుల నుంచి కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.

కార్నెల్ యూనివర్శిటీ పత్రికలో పిస్తా పప్పుల గురించి ప్రత్యేకంగా చర్చించింది. పిస్తా పప్పులు ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. నిజానికి, బ్లూ బెర్రీస్, దానిమ్మ పండ్లు, చెర్రీస్, రెడ్ వైన్ సహా ప్రసిద్ధి యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఆహారాలకు పిస్తా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ప్రత్యర్థిగా ఉంటుంది. అమెరికన్ పిస్తాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే అతి కొద్ది ఆహారాలలో ఒకటి. ఇవి పూర్తి ప్రోటీన్ కూడా. కాలిఫోర్నియాలో పండించిన పిస్తాపప్పుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని పరిశోదనల్లో తేలింది. వీటితో పాటు.. మీ శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన ప్రోటీన్స్ జంతు వనరుల నుంచి మాత్రమే లభిస్తాయి. పిస్తాపప్పులు ప్రోటీన్స్‌కి సహజ మూలం.

అదే విధంగా, అమెరికన్ పిస్తా పప్పులు వాటి నాణ్యత కారణంగా ఫేమస్ అయ్యాయి. వీటిని షిప్పింగ్ చేయడానికి ముందే USFDA ప్రమాణాలను కలిగి ఉంటుంది.

​కొలెస్ట్రాల్ దూరం..

పిస్తాలు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గి రక్తపోటు మెరుగ్గా మారుతుంది. దీంతో చాలా సమస్యలు దూరమవుతాయి. పిస్తా బ్లడ్ లిపిడ్స్‌పై ఎన్నో అధ్యయనాలు ఆహారంలో కేలరీల భాగాన్ని భర్తీ చేస్తాయి. అదే విధంగా వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది.

21 అధ్యయనాల సమీక్ష ప్రకారం, పిస్తా తినడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు, డయాలస్టోలిక్ రక్తపోటు కొంత మేరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Heart attack : చలికాలంలో గుండెనొప్పులు రాకుండా ఏం చేయాలంటే..

బరువు తగ్గడం..

అదే విధంగా పిస్తా పప్పుల్లో కేలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓ ఔన్సు అంటే 28 గ్రాముల పిస్తాపప్పుల్లో కేవలం 160 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా బరువు తగ్గాలనుకునేవారు వీటిని హ్యాపీగా తినొచ్చు. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. అయితే, అది మోతాదులోనే తినాలి, ఎంత తినాలో మీ న్యూట్రిషనిస్ట్‌ని కనుక్కోవడం ముఖ్యం.

పిస్తాపప్పును తినడం వల్ల రక్తపోటును మెరుగుపరచడంలో అదనపు ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. FDA ప్రకారం, సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారంలో భాగంగా పిస్తాలను రోజుకి 42 గ్రాములు తింటే గుండె జబ్బులకి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read : High Blood Pressure : హైబీపి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

​ఎలా తినొచ్చు..

అమెరికన్ పిస్తాపప్పులని ఎలా అయినా తీసుకోవచ్చు. వాటిని ఎప్పుడైనా ఎలాంటి గిల్టీ లేకుండా హెల్దీ స్నాక్‌గా తీసుకోవడం మంచిది. ఈ గింజలను తీపి, టేస్టీ వంటల్లో గార్నిష్‌గా వాడతారు చాలామంది.

పిస్తాపప్పుల్లోని రుచి వల్ల అందరూ వీటిని ఇష్టపడతారు. వీటి క్రంచీనెస్ చాలా మందిని మళ్ళీ మళ్ళీ తినేలా చేస్తుంది. అందుకే వీటిని గార్నిష్‌గా, కూరలు, అన్నం, రైతా, డెజర్ట్స్‌లో వాడతారు.

పిస్తాలను పచ్చిగా, రోస్ట్ చేసి తింటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటారు. పిస్తాపప్పులను డ్రైగా తినడం వల్ల పోషకాలు తగ్గవు.

Also Read : Romance Frustration : ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే శృంగారం చేయలేరట.. జాగ్రత్త..

​ఏ పిస్తాలు బెస్ట్..

ఇండియాలో వాడే పిస్తా పప్పులని ప్రజెంట్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా గార్నిష్, బర్ఫీఐ,ఐస్ క్రీమ్స్‌లలో వాడుతున్నారు. చాలా తక్కువగానే మన ఇండియాలో వీటిని తింటారు. అయితే, వీటిలోని పోషకాల గురించి తెలియడం వల్ల రాను రాను వీటి వినియోగం కూడా పెరిగింది. పిస్తాల్లో చాలా రకాలు ఉంటాయి. అమెరికన్ పిస్తాలు, కాలిఫోర్నియా పిస్తాలు. కాలిఫోర్నియాకు చెందిన పిస్తాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. లుటిన్, జియాక్సంతిన్‌లో చాలా ఎక్కువ ఉంటాయి. కొవ్వులు, అధిక ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకున్న పిస్తా ఇతర దేశాల కంటే చాలా మంచివి. ఇవి మీ రోజువారీ ఆహారంలో చేర్చడానికి, హెల్దీ స్నాక్స్‌గా తీసుకోవడానికి చాలా మంచివి.

కాలిఫోర్నియా పిస్తాలు అన్ని మెయిన్ ఇ కామార్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, ఇండియాలోని మెయిన్ డ్రై ఫ్రూట్ సెంటర్స్‌లలో దొరుకుతాయి. కాలిఫోర్నియా అని ప్రత్యేకంగా మెన్షన్ చేసి వీటిని తీసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ వీటిని మెన్షన్ చేస్తున్నాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *