[ad_1]
Stock Market Opening 20 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఫార్మా షేర్ల పతనం కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 8 పాయింట్ల నష్టంతో 18,099 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 34 పాయింట్ల నష్టంతో 60,823 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,858 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,901 వద్ద మొదలైంది. 60,736 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,901 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 34 పాయింట్ల నష్టంతో 60,823 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 18,107 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,115 వద్ద ఓపెనైంది. 18,069 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,118 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 8 పాయింట్ల నష్టంతో 18,099 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 42,516 వద్ద మొదలైంది. 42,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,627 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 273 పాయింట్లు పెరిగి 42,602 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యునీలివర్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply