మార్కెట్‌పై బుల్‌ పట్టు – సెన్సెక్స్ 600pts అప్‌, 21800 పైన నిఫ్టీ


Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ ఉన్నా, ఈ రోజు (శుక్రవారం, 11 జనవరి 2024) భారత స్టాక్ మార్కెట్లు హయ్యర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యాయి. ఐటీ మేజర్లు ఇన్ఫోసిస్‌, TCS Q3 ఫలితాల సీజన్‌ను ప్రారంభించాక, ఐటీ స్టాక్స్‌ను మార్కెట్‌కు మంచి మద్దతు లభించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా స్వల్పంగా పెరిగింది. వరుసగా రెండు రోజుల పాటు ఉత్సాహంగా పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు నిస్తేజంగా మారాయి. ఐటీ షేర్ల పచ్చదనంతో స్టాక్ మార్కెట్‌లో సందడి కనిపిస్తోంది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (గురువారం) 71,721 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 426 పాయింట్ల లాభంతో 0.60 శాతం వృద్ధితో 72,148 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. నిన్న 21,647 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 126.35 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 21,773 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

బ్రాడర్‌ మార్కెట్‌లో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్‌ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ 0.5 శాతం పెరిగాయి.

మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో.. 2,000 పైగా షేర్లు లాభాల్లో ఉండగా, 278 షేర్లు క్షీణించాయి. ఈరోజు మార్కెట్‌లో ఆల్ రౌండ్ గ్రీన్ సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న స్టాక్స్ ఈ రోజు మరింత పెరిగాయి.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో… 20 స్టాక్స్‌ లాభపడగా, 10 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో… ఇన్ఫోసిస్ షేర్లు 6.5 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. విప్రో 3.89 శాతం, TCS 3.69 శాతం, టెక్ మహీంద్ర 3.40 శాతం, టాటా కన్స్యూమర్స్ 2.64 శాతం, HCL టెక్ 2.5 శాతం పెరిగాయి. 

నిఫ్టీ చిత్రం
నిఫ్టీ50 ప్యాక్‌లో 31 షేర్లు పెరిగితే, 19 షేర్లు క్షీణించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో… ఇన్ఫోసిస్ 6.66 శాతం, విప్రో 3.86 శాతం, TCS 3.72 శాతం, టెక్ మహీంద్ర 3.57 శాతం, టాటా కన్స్యూమర్ షేర్లు 2.97 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ టాప్‌ లూజర్స్‌లో.. M&M 1.49 శాతం, పవర్ గ్రిడ్ 1.18 శాతం పడిపోయాయి. ఏషియన్ పెయింట్స్ 1 శాతం, NTPC 0.96 శాతం క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.89 శాతం బలహీనతలో ఉంది.

ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 574.09 పాయింట్లు లేదా 0.80% పెరిగి 72,295.27 దగ్గర; NSE నిఫ్టీ 155.30 పాయింట్లు లేదా 0.72% పెరిగి 21,802.50 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
USలో, డిసెంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 0.3 శాతం పెరిగింది. MoMలో ఇది 0.2 శాతం పెరుగుతుందని అంచనా వేస్తే, అంతకుమించి వేడిని పెంచింది. ఈ డేటా రిలీజ్‌ అయిన తర్వాత, నిన్న, గణనీయమైన నష్టాల నుంచి కోలుకున్న యూఎస్‌ మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. 

ఆసియా మార్కెట్లలో.. జపాన్ నికాయ్‌ ఈ ఉదయం మరో 1 శాతం పెరిగింది, 35,500 స్థాయికి సమీపంలో ఉంది. 1990 తర్వాత ఇదే అత్యధికం. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ, హాంకాంగ్‌ హ్యాంగ్ సెంగ్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. 

US బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్‌ ఈల్డ్స్‌ 4.9 బేసిస్ పాయింట్లు తగ్గి 3.980 శాతానికి తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 79 డాలర్లకు పైకి చేరింది. బిట్‌కాయిన్‌ ETFలకు యుఎస్ ఆమోదంతో, బిట్‌కాయిన్ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: 100 బిలియన్ డాలర్ల పార్టీలో అంబానీ, రిలయన్స్‌ షేర్ల రైజింగ్‌తో మారిన రేంజ్‌Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *