PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! – ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

[ad_1]

Bank Holidays list in December 2023: ఈ నెలలో (డిసెంబర్‌ 2023) బ్యాంక్‌లకు భారీగా సంఖ్యలో సెలవులు ఉన్నాయి. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో ఏ నెలలోనూ బ్యాంక్‌లకు ఇన్ని సెలవులు రాలేదు. 

డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 18 రోజులు హాలిడేస్‌ వచ్చాయి. వీటిలో… స్థానిక పండుగలు, క్రిస్మస్‌తో పాటు రెండో & నాలుగో శనివారం, ఆదివారాల్లో వచ్చే సెలవులు కూడా కలిసి ఉన్నాయి. డిసెంబర్‌లో, 18 రోజులు హాలిడేస్‌తో పాటు అదనంగా మరో 6 రోజులు కూడా బ్యాంక్‌లు మూతబడతాయి. కారణం.. బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు (Bank Employees On Nationwide Strike) సిద్ధమవుతున్నారు. 

18 రోజులు సాధారణ సెలవులు + 6 రోజులు సమ్మె రోజులతో కలిపి డిసెంబర్‌ నెలలో మొత్తం 24 రోజులు బ్యాంక్‌ సేవలు అందవు. కాబట్టి, ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా ముందే జాగ్రత్త పడండి.

2023 డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in December 2023):

డిసెంబర్ 1, 2023 – రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 3, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 4, 2023  – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ కారణంగా గోవాలో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 9, 2023  – రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 10, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 12, 2023  – ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేస్తారు
డిసెంబర్ 13 & 14, 2023 – లోసంగ్/నామ్‌సంగ్ కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 17, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 18, 2023  – యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 19, 2023  – విమోచన దినోత్సవం కారణంగా గోవాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 23, 2023 – నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 24, 2023  – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 25, 2023  – క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 26, 2023  – క్రిస్మస్ వేడుకల కారణంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 27, 2023 – క్రిస్మస్ వేడుకల కారణంగా నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 30, 2023 – యు కియాంగ్ నంగ్‌బా దృష్ట్యా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 31, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సమ్మె తేదీలు (Bank Strike Dates – December 2023)

బ్యాంక్‌ సిబ్బంది సమ్మె ఈ నెల 4వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభమై, 11వ తేదీ వరకు కొనసాగుతుంది. మధ్యలో రెండో శనివారం, ఆదివారాన్ని మినహాయిస్తే 6 రోజులు బ్యాంక్‌ సేవలు ఆగిపోతాయి. గుడ్డిలో మెల్లలాగ.. అన్ని బ్యాంక్‌లు ఒకేసారి స్ట్రైక్‌కు దిగడం లేదు. ఒకరోజు కొన్ని బ్యాంక్‌లు, మరో రోజు కొన్ని బ్యాంక్‌లు చొప్పున సమ్మెలో పాల్గొంటాయి.

డిసెంబర్ 4, 2023: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ‍‌(P&S Bank), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
డిసెంబర్ 5, 2023: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI)
డిసెంబర్ 6, 2023: కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిసెంబర్ 7, 2023: ఇండియన్ బ్యాంక్, యూకో (UCO) బ్యాంక్
డిసెంబర్ 8, 2023: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డిసెంబర్ 11, 2023: అన్ని ప్రైవేట్ బ్యాంకులు

బ్యాంక్‌ల సమ్మె, సెలవు రోజుల్లో అక్కరకొచ్చే ఆప్షన్స్‌
సమ్మె, సెలవులతో బ్యాంక్‌లు పని చేయకపోయినా, ఖాతాదార్లు ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు పడడం లేదు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ATMని ఉపయోగించవచ్చు, బ్యాంక్‌ సెలవు రోజుల్లోనూ ATMలు 24 గంటలూ పని చేస్తాయి. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా UPI అందుబాటులో ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *