[ad_1]
Buying House in 2023:
భారత స్థిరాస్తి రంగం అద్భుత వేగంతో దూసుకుపోతోంది. 2022లో కొవిడ్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీరేట్ల వంటివి అంతరాయాలు కల్పించినా రియల్ ఎస్టేట్ మాత్రం దూకుడు కనబరిచింది. చాలా మంది సొంత ఇంటి కలను నిజం చేసుకొనేందుకు తాపత్రయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ 2023లో 6.5 నుంచి 7 శాతం వృద్ధిరేటు కనబరుస్తుందని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఆర్బీఐ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంతో వచ్చే ఏడాదీ స్థిరాస్తి రంగంలో జోష్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇళ్ల కొనుగోలుదారులపై కొన్ని అంశాలు ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
మారిన పరిస్థితులు
కరోనా సోకినప్పుడు సొంత ఇల్లు ఎంత ముఖ్యమో చాలా మందికి తెలిసొచ్చింది. ఇరుకు గదుల్లో ఉండటం వల్ల ఒకర్నుంచి మరొకరికి కొవిడ్ సోకింది. అద్దె ఇళ్లలో ఉన్నప్పుడు ఐసోలేషన్ వంటివి కష్టమని అర్థమైంది. చాలా కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశమిచ్చాయి. దాంతో నివసించే చోట ఆఫీస్ వర్క్‌కు ప్రత్యేకమైన గది అవసరం ఏర్పడింది. చాన్నాళ్ల పాటు హైబ్రీడ్ వర్కింగ్ కల్చర్ ఆకర్షించింది. మళ్లీ కొవిడ్ కోరలు సాచడంతో ఐటీ కంపెనీలు ఇదే విధానాన్ని కొనసాగించనున్నాయి. ఫలితంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇంటి కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. ఇంటి దగ్గరే పని చేసుకొనే వెసులు బాటు ఉన్నప్పుడు జనావాసాలతో రద్దీగా ఉండే నగరాల బదులు చిన్న నగరాల్లో ఉండటం బెస్టని భావిస్తున్నారు.
News Reels
కొనసాగనున్న ట్రెండ్
ఈ ఏడాది స్థిరాస్తి రంగం వృద్ధి సాధించడానికి ప్రధాన కారణం ప్రజలు విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడమే. 2023లోనూ ఇదే ట్రెండ్ కొనసాగనుంది. పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇంటి వద్ద పని, హైబ్రీడ్ వర్కింగ్ మోడళ్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు, ధరలు పెరుగుతున్నా సొంతింటికి గిరాకీ పెరుగుతోంది. యువకులు, తొలిసారి ఇళ్లు కొనాలనుకొనేవారి శాతం ఎక్కువగా ఉంది. రిటైల్ రియల్ ఎస్టేట్ 2023లో డిమాండ్ 28 నుంచి 82 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు చేరనుంది. ప్రవాస భారతీయులు స్వదేశంలో భూములు కొంటున్నారు. రూపాయి విలువ తగ్గినా ఎకానమీ పుంజుకోవడంతో ఈ ట్రెండ్ మొదలైంది. అంతర్జాతీయంగా భూములు విలువ పెరుగుతున్న దేశాల్లో భారత్ టాప్-10లో ఉంది.
పెరిగిన డిజిటలైజేషన్
కరోనా సమయంలో డిజిటలైజేషన్ పెరిగింది. ఇప్పటికీ అనేక సంస్థలు తమ పని విధానాన్ని డిజటల్‌లోకి మార్పు చేస్తున్నాయి. అన్ని పరిశ్రమలు ఆన్‌లైన్‌లోకి మారుతున్నాయి. డేటాకు గిరాకీ పెరిగింది. దాంతో డేటా సెంటర్ల అవసరం ఎక్కువైంది. 2025 లోపు డేటా సెంటర్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ 15-18 మిలియన్ చదరపు అడుగులకు పెరుగుతుందని అంటున్నారు.
ఆకు పచ్చ ఇళ్లకు గిరాకీ
స్థిరాస్తి రంగంపై వాతావరణ ప్రభావం పెరుగుతోంది. వాతావరణం, పరిసరాలు, సామాజిక, పాలన పరంగా రియల్ ఎస్టేట్, ఇన్వెస్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా ముగిశాక కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గించడంపై ఇంటి కొనుగోలుదారులకు అవగాహన పెరిగింది. కాస్త ఎక్కువ ధర పెట్టైనా గ్రీన్ హోమ్స్ సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 2023లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉండనుంది. ఇంట్లో వారు ఆరోగ్యం ఉండటమే కాకుండా జీవన ప్రమాణాలు పెరగడం ఇందుకు దోహదం చేస్తోంది. పైగా ఇలాంటి ఇళ్లకు రీసేల్ వాల్యూ బాగుంటోంది.
రిమోట్ వర్కింగ్ కంటిన్యూ
ఏడాది రెండేళ్లకో సారి కరోనా వేవ్‌లు వస్తూనే ఉన్నాయి. వైరస్‌కు ముగింపు కనిపించడం లేదు. దాంతో వర్క్‌ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్కింగ్ కల్చర్ ఇలాగే కొనసాగనుంది. కంపెనీలు హైబ్రీడ్ వర్కింగ్ మోడల్‌ను కొనసాగనుంది. దాంతో హాలిడే హోమ్స్‌కు డిమాండ్ పెరగనుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్, హైబ్రీడ్ విధానం వల్ల ఇళ్లకు డిమాండ్ ఉండనుంది.
రియల్ ఎస్టేటే రియల్ అసెట్
ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే ఛాన్సులు కనిపించడం లేదు. చైనా వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడంతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో నష్టభయం లేని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో సుదీర్ఘ కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. దీంతో స్థిరాస్తి వ్యాపారం మరింత పుంజుకొనుంది. ఇవన్నీ ఇళ్ల కొనుగోలు దారులపై ప్రభావం చూపించనున్నాయి.
[ad_2]
Source link
Leave a Reply