PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

వరుసగా ఏడో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌, రికార్డ్‌ స్థాయికి చేరువ

[ad_1]

Foreign Exchange Reserves in India: భారతదేశ ఆర్థిక పునాది నానాటికీ గట్టి పడుతోంది. మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు వరుసగా ఏడో వారంలోనూ పెరిగాయి, రికార్డు గరిష్ట స్థాయికి అతి చేరువలో ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్‌ చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, 2023 డిసెంబర్ 29తో ముగిసిన వారంలో, భారతదేశ విదేశీ మారక నిల్వలు (India’s Forex Reserves) 2.75 బిలియన్ డాలర్లు పెరిగి 623.20 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో విదేశీ నిధి 620.44 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆరు వారాల్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 30.12 బిలియన్ డాలర్లు పెరిగాయి.  

భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు ‍‌(Forex reserves all-time high record) చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. ఇప్పుడు, కేవలం 22 బిలియన్ల దూరంలో ఉన్నాయి. 

ఆర్‌బీఐ వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ప్రకారం, 2023 డిసెంబర్ 29తో ముగిసిన వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets – FCA) కూడా భారీగా పెరిగాయి. ఆ వారంలో FCAs 1.86 బిలియన్ డాలర్లు పెరిగి 551.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ లోన్లలో సగం వాటా ఇళ్లదే, ఆ తర్వాత జనం తీసుకున్న అప్పులు ఇవి 

పెరిగిన బంగారం నిల్వలు
అదే కాలంలో, ఆర్‌బీఐ బంగారం నిల్వలు కూడా భారీగా పెరిగాయి. ఆర్‌బీఐ గోల్డ్‌ ఛెస్ట్‌ (Gold reserves In India) 853 మిలియన్ డాలర్లు పెరిగి 48.32 బిలియన్ డాలర్లకు చేరింది. SDRs (Special Drawing Rights) 38 మిలియన్ డాలర్లు పెరిగి 18.36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే… అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు తగ్గి 4.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 

ఇటీవలి కాలంలో FPI ‍‌‍‌(ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌) పెట్టుబడులు బలంగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు ఒక రేంజ్‌లో దూసుకెళుతున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ జోక్యం కూడా మరొక కారణం. 

ఏ దేశంలోనైనా విదేశీ మారక నిల్వలు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ది కీలక పాత్ర. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దానిని గుర్తించాలి. 

బలపడిన రూపాయి (Indian Rupee Value)
శుక్రవారం (జనవరి 05, 2024) రోజున, కరెన్సీ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.16 వద్ద (dollar to rupee exchange rate) ముగిసింది, 7 పైసలు బలపడింది.

మరో ఆసక్తికర కథనం: కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పావలా వడ్డీకే రుణం, దీని పూర్తి లాభాల గురించి తెలుసా? 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *