PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

వేసవి కాలం ఈ డ్రింక్స్‌ తాగితే.. మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది..!

[ad_1]

Summer Drinks: ఎండాకాలం మొదలైంది. వేసవిలో విపరీతమైన చెమట కారణంగా డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలసట కూడా వస్తుంది. వేసవిలో రోగనిరోధక వ్యవస్థ మాదిరిగానే, పొట్టలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువ అవుతాయి. అతిసారం, UTI, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు అధికమవుతాయి. ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి, కడుపును శాంతపరచడానికి.. పొట్ట చల్లబరిచే ఆహారం తినడం చాలా ముఖ్యం. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ అల్కా విజయన్ వేసవిలో జీర్ణక్రియకు మేలు చేసి, డీహైడ్రేషన్‌ సమస్యను దూరం పెట్టే ఉత్తమమైన పానీయాల గురించి మనకు వివరించారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

మజ్జిగ..

మజ్జిగ..

వేసవి పానీయాల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉండేది మజ్జిగ. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్‌ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్‌ మీ గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్‌, బి12 వంటి విటమిన్లు పుష్కలం. ఇవి మనసును, శరీరాన్ని శాంత పరచడమే కాకుండా వడదెబ్బ నుంచీ రక్షిస్తాయి. మీకు మజ్జిగ ఇష్టం లేదంటే స్మూతీలా గానీ, పండ్ల ముక్కలతో కలిపికానీ ట్రై చేయవచ్చు. ఏదేమైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక్క గ్లాసు మజ్జిగైనా తాగేలా చూసుకోండి.

నిమ్మరసం..

నిమ్మరసం..

వేసవి కాలం నిమ్మరసం కలిపి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి నిమ్మరసంలోని యాసిడ్స్‌ తోడ్పతాయి. దీంతో, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. మీరు సబ్జాగింజలు నానబెట్టిన నీటిలో నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా మంచిది. ఈ డ్రింక్‌ శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.

కొబ్బరి నీళ్లు..

కొబ్బరి నీళ్లు..

వేసవి కాలంలో UTI, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కొబ్బరి నీళ్లు బెస్ట్‌ డ్రింక్‌ అని చెప్పాలి. కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటీ వేధిస్తుంటే.. గ్లాస్‌ కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.

చెరకు రసం..

చెరకు రసం..

మండే ఎండలో.. చల్లని చెరకు రసం తాగితే అలసట, నిస్సత్తువ మాయం అవుతాయి. శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది. చెరకు రసంలో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వేసవిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి చెరకు రసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

పటికబెల్లం వేసిన పాలు..

పటికబెల్లం వేసిన పాలు..

వేసవిలో, అధిక వేడి కారణంగా పిత్త దోషం ఏర్పడుతుంది. కాబట్టి, పడుకునే ముందు పటిక బెల్లం వేసిన పాలు తాగితే చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది.

అరటిదిండు రసం..

అరటిదిండు రసం..

అరటిదిండు రసం గురించి చాలా మందికి తెలియదు. అరటిదిండులో అనేక పోషకాలు ఉంటాయి. అరటి దిండులో పొటాషియం, విటమిన్‌ బి6, ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనిలోని ఫైబర్‌ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *