నేడు ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు స్పీడ్‌గా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మీకు షుగర్ ఉంటే… గుండె సమస్యలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుంది. నిజానికి, ఎక్కువ చక్కెర స్థాయిలు కాలక్రమేణా గుండె రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తాయి.

​మూలికలు..

ఈ నేపథ్యలో ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్‌సర్ షుగర్ పేషెంట్స్‌కి గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచించారు.

ఇక్కడ ఒకటి గమనించాలి.. అదేంటంటే షుగర్ ఉన్నవారు దానిని తగ్గించేందుకు మెడిసిన్ తీసుకోవడం వల్ల జీవక్రియ తగ్గుతుంది. కాలక్రమేణా కాలేయం తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, ఈ 5 మూలికలు చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండెజబ్బులని తగ్గించడంలో సాయపడతాయి.

ఆయుర్వేద నిపుణుల సలహా..

​అర్జున్ చాల్..

​అర్జున్ చాల్..

ఆయుర్వేదంలో దొరికే అద్భుత మూలిక ఇది. దీనిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు తగ్గి పనితీరు మెరుగవుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ నుండి అన్ని సమస్యల్ని దూరం చేసేందుకు ఈ బెరడు మంచిది. షుగర్, గుండె సమస్యలు ఉన్నవారు పడుకునేముందు దీనిని టీగా తీసుకోవడం చాలా మంచిది.

పునర్నవ..

పునర్నవ..

ఇది సహజ మూత్ర విసర్జనగా పనిచేసే మూలిక దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. ఇది లివర్, కిడ్నీలు, కళ్ళకి కూడా మంచిది. దీంతో పాటు జీవక్రియను మెరుగ్గా చేస్తుంది. రోజూ 2 నుంచి 5 గ్రాముల మూలికను పరగడపున తీసుకుంటే చాలా మంచిది.

​యాలకులు..​

​యాలకులు..​

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. స్వీట్స్ తినాలనే కోరికలను తగ్గించ చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది యాలకులు. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్‌కి దాహంగా ఉండే ఫీలింగ్‌ని కూడా దూరం చేస్తుంది.

​నల్ల మిరియాలు..

​నల్ల మిరియాలు..

వీటిని చాలా మంది వాడతారు. ఈ మసాలా పదార్థాలు సెన్సిటివిటీ, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. ముఖ్యంగా పెద్దవారిలో గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ప్రతి రోజూ ఉదయం వీటిని తీసుకోవచ్చు.
Also Read : పీరియడ్స్ టైమ్‌లో ప్యాడ్ రెగ్యులర్‌గా మార్చకపోతే జరిగేది ఇదే..

శొంఠి..

శొంఠి..

ఆయుర్వేద నిపుణుల ప్రకారం అల్లం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, జీవక్రియని కాపాడతాయి. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎలాంటి గుండెపోటుతో పాటు ప్రాణాంతక సమస్యలు కూడా దూరమవుతాయి. ఇందుకోసం గోరువెచ్చని నీటలో అల్లం పొడి కలిపి భోజనానికి ముందు తీసుకోవచ్చు. దీని వల్ల మంట తగ్గి గుండెకి మంచిది.
Also Read : Diabetes Management : షుగర్ ఉన్నవారు రోజులో ఏం తినాలి.. ఏం తినకూడదు..

​చివరిగా..

​చివరిగా..

ఇప్పుడు చెప్పిన మూలకాలన్నీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, వీటిని మీరు డైట్‌లో యాడ్ చేసే ముందు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
​​గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​Read More :Health NewsandTelugu News

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *