సీనియర్‌ సిటిజన్లకు నమ్మకంగా 9 శాతం పైగా వడ్డీ ఆదాయం, వేరే చోట రిస్క్‌ చేయడం ఎందుకు?

[ad_1]

Higher interest rates on senior citizen fixed deposits: ఇప్పుడు, దేశ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన పెరిగింది. చేతిలో డబ్బులు ఉంటే చాలా మంది పొదుపు (savings) చేయడం కంటే పెట్టుబడి (Investment) పెట్టే మార్గాల కోసం వెదుకుతున్నారు. ఎందుకంటే, పొదుపు చేయడం వల్ల సంపద ‍‌(Wealth creation) సృష్టించలేం. పెట్టుబడులతోనే అది సాధ్యం అవుతుంది.

పెట్టుబడులు పెట్టడానికి, షేర్‌ మార్కెట్‌, బంగారం వంటి కమొడిటీస్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి చాలా మార్గాలు ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టినా, ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే ‍‌(Return on Investment) ఎక్కువ రిస్క్‌ తీసుకోవాలి. తక్కువ రిస్కీ అసెట్స్‌ను (Risky Assets) ఎంచుకుంటే, దాని మీద ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. 

అయితే, రిస్క్‌ తీసుకోకుండానే ఆకర్షణీయమైన ఆదాయాన్ని సంపాదించే మార్గం ఒకటి ఉంది. అది.. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ‍‌(Fixed Deposits). ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ‍‌(Secured investment) కేటగిరీలోకి వస్తాయి. అంటే, పెట్టుబడి డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. పైగా, ముందే నిర్ణయించిన వడ్డీ రేటుతో ఏటా స్థిరమైన వడ్డీ ఆదాయం వస్తుంది. తద్వారా. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించగలుగుతాం.

సాధారణంగా, సాధారణ పౌరుల కంటే సీనియర్‌ సిటిజన్ల (60 సంవత్సరాల వయస్సు దాటిన వ్యక్తులు) ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద అన్ని బ్యాంక్‌లు ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తాయి. ప్రస్తుతం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఆరు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.5 శాతం వరకు వడ్డీ రేటును ‍‌(Interest rate on fixed deposits) చెల్లిస్తున్నాయి. దేశంలోని మరే ఇతర బ్యాంకుల్లోనూ ఇంత భారీ వడ్డీ ఆదాయం దొరకడం లేదు.

సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని ఆఫర్‌ చేస్తున్న బ్యాంకులు (Banks offering higher interest rates to senior citizens):

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌: 1001 రోజులకు మెచూర్ అయ్యే సీనియర్‌ సిటిజన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 9.5% వడ్డీని ఈ బ్యాంక్‌ చెల్లిస్తోంది. ఈ కాల పరిమితిపై మాత్రమే అధిక వడ్డీ రేటును పొందగలం.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 750 రోజులకు మెచ్యూర్‌ అయ్యే సీనియర్ సిటిజన్‌ డిపాజిట్‌ మీద ఈ బ్యాంక్‌ 9.21% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేటు ఈ స్కీమ్‌కు మాత్రమే పరిమితం.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్‌ కూడా, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్లకు 9.10%తో ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని చెల్లిస్తోంది.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్‌ 444 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ స్కీమ్‌ను రన్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సీనియర్ సిటిజన్లు 9% వడ్డీ ఆదాయాన్ని డ్రా చేయవచ్చు.

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు ముగిసే కాలం కోసం డిపాజిట్‌ చేస్తే, సీనియర్ సిటిజన్లు 9% వడ్డీని అందుకోవచ్చు.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్‌లో కూడా, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్ల మీద గరిష్టంగా 9% వడ్డీ ఆదాయాన్ని సీనియర్‌ సిటిజన్లు సంపాదించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: రూ.13 వేల కోట్లు కనిపిస్తున్నా తీసుకునే మనిషే లేడు, మీరు ట్రై చేస్తారా?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *