PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

సెకండ్ హ్యాండ్ కార్ల వల్ల ఉపయోగం ఏంటి? – ఎంత వరకు సేవ్ చేయవచ్చు?

[ad_1]

Benefits of Used Cars: ఒక కారు కొనుక్కోవాలనేది చాలా మంది మధ్యతరగతి వాసుల కల. కానీ ప్రస్తుతం కొత్త కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ ధరకు మంచి కారును సెకండ్ హ్యాండ్ ద్వారా దక్కించుకోవచ్చు.

రుణంపై ఆదా
మీరు ఫైనాన్స్‌లో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, ఈ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మార్కెట్‌లోని అనేక ఫైనాన్స్ కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్ల కోసం రీజనబుల్ వడ్డీ రేట్లకు ఫైనాన్స్‌ను అందిస్తాయి.

మీరు కుటుంబం, స్నేహితులతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే యూజ్డ్ కారును కూడా కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ కారులో కూడా చాలా ఫీచర్లను పొందే అవకాశం ఉంది. కొత్త కారును కొనడానికి చేసిన పొదుపుతో పాత కారును మీకు కావాల్సినట్లు మాడిఫై చేసుకోవచ్చు.

ఇన్సూరెన్స్‌పై కూడా…
మీరు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ద్వారా ఇన్సూరెన్స్‌పై కూడా ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు పాత కారును కొనుగోలు చేసినప్పుడు, దాని మార్కెట్ విలువ తగ్గుతుంది. కొంత కాలం తర్వాత సెకండ్ హ్యాండ్ కార్లపై 30 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. బీమా ప్రీమియం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా సెకండ్ హ్యాండ్ కారు బీమా రేట్లపై గణనీయమైన పొదుపు చేయవచ్చు.

ఉపయోగించిన కార్ల గురించి చాలా అపోహ ఏమిటంటే వాటి నాణ్యత సరిగ్గా ఉండదని. కానీ అది నిజం కాదు. కారును సరిగ్గా మెయింటెయిన్ చేయని వారి వద్ద కొనుగోలు చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి కార్ల యూజర్లు తరచూ తమ కార్లను వివిధ కారణాల వల్ల అప్‌గ్రేడ్ చేస్తారు. ఇది కారు నాణ్యతను ప్రభావితం చేయదు. ఉదాహరణకు మీరు 2016 మారుతి విటారా బ్రెజ్జా లేదా మరేదైనా కారుని కొనుగోలు చేస్తే, మీరు చాలా ఫీచర్లతో గొప్ప లగ్జరీ, పనితీరును పొందవచ్చు.

మంచి రీసేల్ వాల్యూ
ఏ కారు అయినా షోరూమ్ నుంచి బయటకు రాగానే దాని విలువ తగ్గడం మొదలై కొన్నాళ్ల తర్వాత కారు మార్కెట్ విలువ చాలా తక్కువగా మారుతుందని అందరికీ తెలిసిందే. మీరు పాత కారును కొనుగోలు చేసినప్పుడు దాని విలువ వేగంగా తగ్గదు. మీరు దాన్ని మళ్లీ విక్రయిస్తే మెరుగైన డీల్‌ను పొందవచ్చు.

మరోవైపు టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ కారు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉండనుంది. టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన పంచ్ ఈవీ ఉండనుంది. పంచ్ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో వస్తుంది. ఇందులో మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ ఉండనున్నాయి. వీటిలో లాంగ్ రేంజ్ పంచ్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో ఛార్జ్‌కి 325 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. టియాగో ఈవీ, టిగోర్ ఈవీలకు ప్రత్యామ్నాయంగా టాటా పంచ్ ఈవీ ఉండనుందని సమాచారం. మిడ్ రేంజ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో లో రేంజ్ వెర్షన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది 125 బీహెచ్‌పీ కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది.

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ – సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో – ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *