PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

సెన్సెక్స్‌, నిఫ్టీలో గ్రాండ్‌ ఓపెనింగ్‌ – మళ్లీ 20 శాతం పతనమైన పేటీఎం

[ad_1]

Stock Market News Today in Telugu: గురువారం నాడు, కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ వల్ల గమ్యం లేని గాలిపటాల్లా కదిలిన ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు, ఈ రోజు (శుక్రవారం, 02 ఫిబ్రవరి 2024) గ్యాప్‌-అప్‌తో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌కు ఒకరోజు తర్వాత మార్కెట్‌ బుల్స్‌ మళ్లీ రంగంలోకి దిగాయి. ఐటీ, ఫైనాన్షియల్స్‌తో పాటు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో (Reliance industries share price today) బలమైన లాభాలు సూచీలను కదిలించాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వీస్తున్న సానుకూల పవనాలు కూడా స్ఫూర్తిని రగిలించాయి. మార్కెట్‌ ఓపెనింగ్‌ సమయంలో.. అన్ని సెక్టార్లు గ్రీన్‌లో ఉన్నాయి, రియాల్టీ ఇండెక్స్‌ అన్నింటికంటే ముందంజలో ఉంది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (గురువారం) 71,645 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 332.27 పాయింట్లు లేదా 0.46 శాతం జూమ్‌తో 71,977.56 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 21,697 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 115.30 పాయింట్లు లేదా 0.53 శాతం హై జంప్‌తో 21,812.75 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

బ్యాంక్ నిఫ్టీ 427.25 పాయింట్లు లేదా 0.93 శాతం గ్యాప్‌-అప్‌తో 46,615 స్థాయికి చేరుకుంది.

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.6 శాతం, స్మాల్‌ క్యాప్ సూచీ 0.8 శాతం లాభపడ్డాయి.

సెన్సెక్స్‌ షేర్లలో… రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ తలో 2 శాతం చొప్పున పెరిగాయి. టెక్ మహీంద్ర, ఎన్‌టీపీసీ, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌బీసీసీ, హడ్కో, స్పైస్‌జెట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, క్యాస్ట్రోల్ కూడా కూడా బలమైన లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు మేజర్‌ ఐటీ షేర్లు సెన్సెక్స్‌ను పైకి నెడుతున్నాయి. మరోవైపు… ఐషర్ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మారుతి సుజుకీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నాయి.
 
నిఫ్టీ షేర్లలో… అదానీ పోర్ట్స్, BPCL, కోల్ ఇండియా లీడ్‌లో ఉన్నాయి.

Paytm పేమెంట్స్ బ్యాంక్‌ మీద రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఆంక్షల నేపథ్యంలో గురువారం 20% తగ్గి రూ.609 కి పడిపోయిన పేటీఎం షేర్లు, అదే మూడ్‌ కంటిన్యూ చేశాయి. ఈ రోజు కూడా 20% పతనంతో రూ.487.20 స్థాయికి జారిపోయాయి.

బలహీనమైన Q3 ఫలితాల కారణంగా రైట్స్‌ (RITES) 5% క్షీణించింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెలివెరీ, ఇండిగో, LIC హౌసింగ్ ఫైనాన్స్, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, మహీంద్ర హాలిడేస్, NIIT, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, సుందరం ఫాస్టెనర్స్, టాటా మోటార్స్, టిటాగర్ రైల్ సిస్టమ్స్, టోరెంట్ ఫార్మా, TTK హెల్త్‌కేర్, UPL, వర్ల్‌పూల్ కంపెనీలు ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ షేర్లన్నీ ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 762.55 పాయింట్లు లేదా 1.06% పెరిగి 72,407.85 దగ్గర; NSE నిఫ్టీ 243.25 పాయింట్లు లేదా 1.12% పెరిగి 21,940.70 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్లు
US మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్‌ సిగ్నల్స్‌తో, ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్లు ర్యాలీ చేశాయి. హాంగ్ సెంగ్, కోస్పి 1.2 శాతానికి పైగా పెరిగాయి. నికాయ్‌, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.8 శాతం లాభపడగా, తైవాన్ 0.3 శాతం పెరిగింది.

FOMC మీటింగ్‌ ముగిసిన తర్వాత యూఎస్‌లో వడ్డీ రేట్ల అంశం మరుగునపడింది, ట్రేడర్ల ఫోకస్‌ కార్పొరేట్‌ ఆదాయాలపైకి మళ్లింది. దీంతో, గురువారం, US మార్కెట్లు హై జంప్‌ చేశాయి. డౌ జోన్స్ 1 శాతం లాభపడింది. S&P 500, నాస్‌డాక్ 1.3 శాతం వరకు పెరిగాయి. USలో, మార్చిలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందన్న బెట్స్‌ 37 శాతానికి పడిపోయాయి, మేలో రేటు తగ్గింపు ఉంటుందన్న బెట్స్‌ 96 శాతానికి చేరాయి.

US 10-ఇయర్స్‌ ట్రెజరీ బాండ్ ఈల్డ్‌ 3.865 శాతానికి పడిపోయింది. కమోడిటీస్‌లో… గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు $2,070కి చేరుకోగా, బ్రెంట్ ఆయిల్ బ్యారెల్‌కు $80 దిగువకు పడిపోయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *