[ad_1]
Stock Market Today News in Telugu: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు ఇది మరో చారిత్రాత్మక రోజు, నిఫ్టీ కొత్త ‘ఆల్ టైమ్ హై లెవెల్’ను (Nifty at fresh all-time high) చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 తర్వాత నిఫ్టీ మరోమారు సరికొత్త రికార్డ్ స్థాయికి ఎదిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించిన ఆర్థిక వృద్ధి గణాంకాలు (GDP Data for 2nd Quarter Of 2023-24) మార్కెట్‌లో హుషారు నింపాయి.
ఈ రోజు (శుక్రవారం, 01 డిసెంబర్ 2023) మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే నిఫ్టీ చరిత్రాత్మక గరిష్ట స్థాయి 20,269.20 (ఉదయం 10.40 గంటల సమయానికి) తాకింది. అంతకుముందు, 2023 సెప్టెంబర్ 15న నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. అప్పటి రికార్డ్ 20,222.45 పాయింట్లు. ఆ రికార్డ్ ఈ రోజుతో కనుమరుగైంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
నిన్న (గురువారం, 30 నవంబర్ 2023) 66,988 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 192.71 పాయింట్లు లేదా 0.29 శాతం పెరుగుదలతో 67,181 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గత సెషన్‌లో 20,133 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 60.95 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 20,194 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో అన్ని రంగాల సూచీలుగ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఆ సమయానికి క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్, పవర్, రియాల్టీ సెక్టార్లు 1-2 శాతం వరకు పెరిగాయి.
బీఎస్‌ఈ మిడ్ క్యాప్ (BSE Midcap), స్మాల్ క్యాప్ (BSE Smallcap) సూచీలు తలో 0.5 శాతం జంప్ చేశాయి.
నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. NTPC, ONGC, L&T, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ ఉండగా; నిఫ్టీ టాప్ లూజర్స్‌లో.. బజాజ్ ఆటో, విప్రో, హీరో మోటోకార్ప్, HCL టెక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ చేరాయి.
అడ్వాన్స్/డిక్లైన్ రేషియో
బిజినెస్ ప్రారంభంలో.. సెన్సెక్స్‌లో 2,132 షేర్లు పెరుగుతుండగా, 785 షేర్లు క్షీణిస్తున్నాయి. 116 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఉదయం 10.30 గంటల సమయానికి… సెన్సెక్స్ 439.38 పాయింట్లు లేదా 0.66% పచ్చదనంతో 67,427.81 స్థాయి వద్ద; నిఫ్టీ 124.70 పాయింట్లు లేదా 0.62% గ్రీన్ కలర్‌లో 20,257.85 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
గురువారం US మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. డౌ జోన్స్ 1.5 శాతం పెరిగితే, నాస్‌డాక్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఈ రోజు, US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగంతో పాటు తయారీ & నిర్మాణ రంగాల డేటాపై మార్కెట్ ఫోకస్ ఉంటుంది.
ఆసియాలో మార్కెట్లలో… ఈ ఉదయం కోస్పి దాదాపు 1 శాతం పడిపోయింది. నికాయ్, తైవాన్ కూడా కొద్దిగా రెడ్ కలర్‌లో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అంచనాలను మించిన భారత ఆర్థిక వృద్ధి, పత్తా లేకుండా పోయిన చైనా
[ad_2]
Source link