అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌

[ad_1]

Adani Group Stocks: ఇవాళ (మంగళవా, 06 మే 2023) స్టాక్‌ మార్కెట్‌ ఓపెనింగ్‌ సెషన్‌లో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ఆనందంతో చిందులేశాయి, 3% వరకు పెరిగాయి. అదానీ గ్రూప్‌, తనకున్న అప్పుల్లో కొంతభాగాన్ని ముందుస్తుగానే తీర్చేసింది. దీంతో, సెంటిమెంట్‌ మెరుగుపడి, స్టాక్స్‌ ప్రైస్‌ పెరిగింది.
 
అదానీ గ్రూప్‌ 2.65 బిలియన్‌ డాలర్ల విలువైన రెండు రకాల లోన్లను గడువు కంటే ముందుగానే (pre-pay) చెల్లించింది. ఈ విషయాన్ని సోమవారం రాత్రి ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

ప్రీపెయిడ్ రుణాల్లో ఒకటి షేర్లను తనఖా పెట్టి తీసుకున్న ఫైనాన్సింగ్‌. దీనికి సంబంధించి 2.15 బిలియన్‌ డాలర్లు చెల్లించింది. మార్చి 31 వరకు గడువు ఉన్నా, మార్చి 12నే ఈ మొత్తం కట్టేసింది. అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు కోసం తీసుకున్న అప్పుపై 203 మిలియన్‌ డాలర్ల వడ్డీని, అసలులో 500 మిలియన్‌ డాలర్ల రుణాన్ని కూడా ప్రి-పే చేసింది.

2.65 బిలియన్‌ డాలర్ల లోన్‌ మొత్తం చెల్లింపు తర్వాత, అదానీ గ్రూప్‌ నెట్‌ డెట్‌/ఎబిటా రేషియో 3.27కు మెరుగుపడింది. 

2.80% వరకు లాభం
మార్నింగ్‌ సెషన్‌లో… అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) 3% జంప్ చేసి నిఫ్టీ50 టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ (Adani Ports & Special Economic Zone), అదానీ పవర్ (Adani Power), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), ACC, అంబుజా సిమెంట్స్ (Ambuja Cements), న్యూఢిల్లీ టెలివిజన్ (NDTV) 0.30-2.80% మధ్య లాభపడ్డాయి. ఆ సమయానికి అదానీ ట్రాన్స్‌మిషన్ (NDTV) మాత్రమే నష్టాల్లో ట్రేడవుతోంది.

సోమవారం పబ్లిష్‌ చేసిన అదానీ గ్రూప్ క్రెడిట్ సమ్మరీ ప్రకారం, 10 లిస్టెడ్ కంపెనీల వద్ద రూ. 40,351 కోట్ల క్యాష్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఏడాదిలో స్థూల ఆస్తులు రూ. 1.06 లక్షల కోట్లు పెరిగి, రూ. 4.23 లక్షల కోట్లకు చేరాయి.

FY23లో, అదానీ గ్రూప్ రూ. 57,219 కోట్ల ఎబిటాతో (ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌) ఉంది. అంతకుముందు సంవత్సరం కంటే 36.2% పెరిగింది. కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్‌ఫోలియో వాటా ఎబిటాలో దాదాపు 83%గా ఉంది.

ఓడరేవుల నుంచి వంట నూనె వరకు వివిధ వ్యాపారాలు చేస్తున్న అదానీ గ్రూప్‌, హిండెన్‌బర్గ్‌ బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌ తర్వాత తన అప్పులను తీర్చే వేగాన్ని పెంచింది. ఇంతకుముందు కూడా బిలియన్ల విలువైన అప్పులను ముందుగానే తీర్చింది. ఇందుకోసం, ఎక్స్‌పాన్షన్‌ ప్లాన్స్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టింది.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *