ఆగని క్రాష్‌! నష్టాల్లోనే బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ, సెన్సెక్స్‌ – PSU Banks మాత్రం కేక!

[ad_1]

Stock Market at 12 PM, 11 August 2023:

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో  కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం గిఫ్ట్‌ నిఫ్టీ నష్టాల్లో ట్రేడవ్వడం ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 89 పాయింట్లు తగ్గి 19,453 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 300 పాయింట్లు తగ్గి 65,391 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,688 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,727 వద్ద మొదలైంది. 65,331 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,727 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 300 పాయింట్ల నష్టంతో 65,391 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,543 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,554 వద్ద ఓపెనైంది. 19,434 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,557 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 89 పాయింట్లు తగ్గి 19,453 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,568 వద్ద మొదలైంది. 44,277 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,571 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 183 పాయింట్లు తగ్గి 44,357 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, పవర్ గ్రిడ్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, సన్‌ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ పతనం అయ్యాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.76200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.630 పెరిగి రూ.24,300 వద్ద ఉంది.

Also Read: రిలయన్స్ షేర్‌హోల్డర్లకు సూపర్‌ గిఫ్ట్‌, డీమ్యాట్‌ ఖాతాల్లోకి జియో ఫైనాన్స్‌ షేర్లు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *