ఆటో సెక్టార్‌ అంటే ఆసక్తా?, షార్ట్‌టర్మ్‌ కోసం వీటిని కొనొచ్చు!

[ad_1]

Auto Stocks: 2022 డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలు మిక్స్‌డ్‌ బ్యాగ్‌లా ఉన్నాయి. బ్యాంకింగ్‌ సహా కొన్ని రంగాలు మంచి ఫలితాలను, ఐటీ వంటి మరికొన్ని రంగాలు ఒక మోస్తరు నంబర్లను ప్రకటించాయి. స్టాక్‌ మార్కెట్‌ ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ నిరుత్సాహపరచలేదు. మోదీ ప్రభుత్వం 2.0లో ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కాబట్టి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్ని వర్గాలకు సమంజసంగా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా, మార్కెట్‌ ముందు నుంచి ఊహించినట్లుగా మూలధన వ్యయాలు, గ్రామీణ భారతదేశ వృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ కేటాయింపుల ద్వారా వాహన కంపెనీలు లాభపడనున్నాయి.

2023 జనవరి నెల విక్రయాల సమాచారాన్ని వాహన కంపెనీలు ఇటీవలే విడుదల చేశాయి, మంచి సేల్స్‌ సాధించాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలిక పెట్టుబడుల కోసం కొనదగిన కొన్ని ఆటో స్టాక్స్‌ ఇవి:

మారుతి సుజుకీ ‍‌(Maruti Suzuki)
గత నెలలో ఇన్వెంటరీ క్లియరింగ్ తర్వాత బలమైన రికవరీని ఈ కంపెనీ సాధించింది. 2022 డిసెంబర్‌ నెలతో పోలిస్తే, 2023 జనవరి విక్రయాలు దాదాపు 24%, 2022 జనవరితో పోలిస్తే 12% పెరిగాయి. ప్రధానంగా మినీ కార్స్‌ & SUV విభాగాల్లో మంచి వృద్ధి కనిపించింది.

మహీంద్ర అండ్ మహీంద్ర (Mahindra and Mahindra)
సంవత్సరం ప్రాతిపదికన (2022 జనవరితో పోలిస్తే), ట్రాక్టర్ అమ్మకాల్లో 27% బలమైన వృద్ధిని M&M నివేదించింది. ఆశాజనకంగా ఉన్న రబీ పంట సీజన్‌ దృష్ట్యా ట్రాక్టర్ల అమ్మకాలు బలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. SUV సెగ్మెంట్ కూడా, మునుపటి సంవత్సరంతో పోలిస్తే 66% వృద్ధి చెందింది. జనవరిలో కమర్షియల్‌ వెహికల్‌ (CV) అమ్మకాలు తగ్గినా, SUV అమ్మకాల్లో బలం ఆ లోటును భర్తీ చేసింది.

టాటా మోటార్స్ (Tata Motors)
టాటా మోటార్స్ ప్యాసెంజర్‌ వెహికల్‌ (PV) విభాగంలో అమ్మకాలు సంవత్సరానికి 18% పెరిగి బలమైన వృద్ధిని సాధించాయి. LCV ‍‌(Light Commercial Vehicle) విభాగంలో సేల్స్‌ తగ్గినా, MHCV (medium and heavy commercial vehicle) అమ్మకాల్లో బలం ఆ లోటును కనిపించనివ్వలేదు. EV అమ్మకాలు నెలవారీగా (2022 డిసెంబర్‌తో పోలిస్తే) 7% పెరిగాయి, మొత్తం దేశీయ PV అమ్మకాలలో 8.6%గా ఉన్నాయి. Tiago EV డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నందున EV విభాగంలో వృద్ధి వేగవంతమవుతుందని అంచనా.

అశోక్ లేలాండ్ (Ashok leyland)
అశోక్ లేలాండ్ MHCV విభాగంలో బలమైన వృద్ధిని & LCV వ్యాపారంలో మెరుగైన పనితీరును కనబరిచింది. 2023 జనవరిలో దేశీయ అమ్మాకాలు సంవత్సరానికి (2022 జనవరితో పోలిస్తే) 27% వృద్ధి చెందగా, ఎగుమతులు సంవత్సరానికి 18% పడిపోయాయి.

ఐషర్ మోటార్స్ (Eicher Motors)
జనవరి నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాల్యూమ్స్‌ స్మార్ట్ రికవరీని సాధించాయి, వీటి అమ్మకాలు సంవత్సరానికి 27% పెరిగి 74.7k యూనిట్లకు చేరుకున్నాయి. బలమైన దేశీయ డిమాండ్‌తో VECV (VE Commercial Vehicles) అమ్మకాలు సంవత్సరానికి 32% పెరిగాయి.

ద్విచక్ర వాహనాలు 
బజాజ్ ఆటో (Bajaj Auto), టీవీఎస్‌ మోటార్స్‌ స్టాక్స్‌కు (TVS Motors) BNP పరిబాస్ “హోల్డ్” రేటింగ్‌ ఇచ్చింది. హీరో మోటోకార్ప్‌కి ‍‌(Hero MotoCorp) “రెడ్యూస్” రేటింగ్ ఇచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *