ఆద్యంతం ఒడుదొడుకులే! 19,733 వద్ద క్లోజైన నిఫ్టీ

[ad_1]

Stock Market Closing 1 August 2023:

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు సాయంత్రం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు, పీఎంఐ డేటా నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 20 పాయింట్లు తగ్గి 19,733 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 68 పాయింట్లు తగ్గి 66,459 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.26 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,527 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,532 వద్ద మొదలైంది. 66,388 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,658 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 68 పాయింట్ల నష్టంతో 66,459 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,753 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,784 వద్ద ఓపెనైంది. 19,704 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,795 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 20 పాయింట్లు తగ్గి 19,733 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,740 వద్ద మొదలైంది. 45,471 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,740 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 58 పాయింట్లు తగ్గి 45,592 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌, హీరో మోటోకార్ప్‌, అదానీ పోర్ట్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మెటల్‌ మినహా అన్ని రంగాల సూచీలు తగ్గాయి. ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.78000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.520 పెరిగి రూ.25,110 వద్ద కొనసాగుతోంది.

Also Read: గుడ్‌న్యూస్‌ – LPG సిలిండర్ రేటు ₹100 తగ్గింది, కొత్త రేటు ఇదే

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *