ఇండియాలోకి ‘ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌’‌ – పూర్తిగా ఫ్రీ + బోల్డెన్ని బెనిఫిట్స్‌

[ad_1]

Apple Credit Card In India: ఇండియన్‌ మార్కెట్‌ మీద తెగ ఆసక్తి చూపిస్తున్న టెక్నాలజీ జెయింట్‌ ఆపిల్, రెండు నెలల క్రితం దిల్లీ, ముంబయిలో ఐఫోన్‌ (iPhone) రిటైల్‌ స్టోర్లను ఓపెన్‌ చేసింది. ఇప్పుడు సొంత క్రెడిట్ కార్డ్‌ను కూడా భారత్‌లో లాంచ్‌ చేసేందుకు రెడీ అయింది. కస్టమర్లు ఐఫోన్‌ పట్టుకుని తిరిగినట్లు, ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌ను జేబులో పెట్టుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి.

ఆపిల్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) టిమ్ కుక్, ఆపిల్‌ రిటైల్‌ స్టోర్ల ఓపెనింగ్‌ కోసం ఏప్రిల్‌లో ఇండియాకు వచ్చినప్పుడు, HDFC బ్యాంక్ CEO & MD శశిధర్ జగదీషన్‌ను కలిశారు. ఇండియన్‌ క్రెడిట్‌ కార్డ్‌ మార్కెట్‌ గురించి ఆరా తీసినట్లు మనీ కంట్రోల్‌ రిపోర్ట్‌ చేసింది.

మన కంట్రీలో ‘ఆపిల్‌ పే’ (Apple Pay) ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (NPCI) ఆపిల్‌ చర్చలు జరుపుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. రూపే (RuPay) ప్లాట్‌ఫామ్ ద్వారా క్రెడిట్‌ కార్డ్‌ను లాంచ్‌ చేయవచ్చు. ఆపిల్‌ రూపే క్రెడిట్ కార్డ్‌ను UPIకి లింక్ చేసే ఛాన్స్‌ కూడా ఉంది.

HDFC బ్యాంక్ CEOతో టిమ్‌ కుక్‌ మాట్లాడారని ముందే చెప్పుకున్నాం కదా. HDFC బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను లాంచ్‌ చేసేందుకు ఆ మీటింగ్‌ జరిగింది. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోనూ (RBI) ఆపిల్‌ చర్చలు జరిపింది. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ తీసుకురావాలంటే ఇండియన్‌ రూల్స్‌ పాటించాల్సిందేనని ఆపిల్‌కి RBI తెగేసి చెప్పింది.

ఆపిల్‌ కార్డ్‌ అంటే ఆషామాషీ కాదు
ఆపిల్‌ అంటే గ్లోబల్‌ బ్రాండ్‌. తన బ్రాండ్‌ ఇమేజ్‌ ఇంచు కూడా తగ్గకుండా సర్వీస్‌ ఇస్తుంది. ప్రస్తుతం, అమెరికాలో ప్రీమియం క్రెడిట్ కార్డ్‌ సర్వీస్‌లు అందిస్తోంది. టైటానియంతో తయారు చేసిన కార్డ్‌ను కస్టమర్లకు జారీ చేసింది. మాస్టర్ కార్డ్ & గోల్డ్‌మన్ సాచ్‌ల భాగస్వామ్యంతో ఆ కార్డ్స్‌ రన్‌ అవుతున్నాయి. ఇండియాలోనూ ఖరీదైన కస్టమర్లనే టార్గెట్‌ చేసే అవకాశం ఉంది.

ఆపిల్‌కు ఇండియాపై ఎందుకింత ఇంట్రెస్ట్‌?
గత రెండేళ్లుగా ఆపిల్‌ భారత్‌పైనే ఫోకస్‌ పెట్టింది. 2022-23లో, ఇండియాలోని ఐఫోన్ మేకర్ల అమ్మకాలు ₹50,000 కోట్ల మార్క్‌ను చేరాయి. ఆపిల్ ఐఫోన్ ప్రొడక్షన్‌లో పెద్ద భాగాన్ని భారత్‌కు ఈ టెక్‌ జెయింట్‌ మారుస్తోంది. మన దేశంలోని మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 4 శాతం వాటా ఆపిల్‌ది. రెండు కోట్ల మంది ఐపోన్‌ కస్టమర్లు ఈ కంపెనీ సొంతం.

ఆపిల్‌ అనేది బ్యాంక్‌ కాదు కదా?
ఆపిల్‌ కంపెనీ బ్యాంక్‌ కాదు కదా, మరి క్రెడిట్‌ కార్డ్‌ ఎలా జారీ చేస్తుంది? ఈ డౌట్‌ మీకూ వచ్చిందా?. క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ చేసే అధికారం బ్యాంకులకు మాత్రమే ఉంది. కాబట్టే HDFC బ్యాంక్‌తో ఆపిల్‌ మాట్లాడుతోంది. ఇండియాలో లాంచ్‌ చేసే ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌ మీద Apple లోగో ఎక్కడా కనిపించదు. HDFC బ్యాంక్‌, రూపే పేరిటే అవి జారీ అవుతాయి. USలోనూ సేమ్‌ సీన్‌. Apple కార్డ్‌లో గోల్డ్‌మన్ సాచ్స్ & మాస్టర్ కార్డ్ బ్రాండ్ పేర్లు మాత్రమే కనిపిస్తాయి.

ఆపిల్ కార్డ్ బెనిఫిట్స్‌
ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌ Apple Payతో లింక్‌ అవుతుంది. లావాదేవీల ద్వారా వచ్చే రివార్డ్స్‌ ఆపిల్‌ వాలెట్‌లో చేరతాయి. ఈ కార్డ్‌ పూర్తిగా ఉచితం, యాన్యువల్‌ ఫీజ్‌ లేదు. యునైటెడ్ స్టేట్స్‌లో, ఆపిల్‌ కార్డ్‌తో వడ్డీ లేని EMI పద్ధతిలో కొనుగోళ్లు చేయవచ్చు. ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌తో ఆపిల్‌ ప్రొడక్ట్స్‌, సర్వీసులు కొంటే 3-5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇతర కంపెనీల వస్తువులు కొంటే 2-3 శాతం క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్‌ ఇస్తుంది.

మరో ఆసక్తికర కథనం: బంగారం కంటే ఖరీదైన టీ పొడి, కాస్ట్‌ వింటే కళ్లు తిరుగుతాయ్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *